‘కాసనోవా’ పాత్రలో నాని, ఆరుగురు హీరోయిన్స్

నేచుర‌ల్ స్టార్ నాని – వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్లో ఓ మూవీ ప్రకటన కొన్ని రోజుల క్రితం వచ్చిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ గురించి అఫిషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ వ‌చ్చేయటంతో ఈ చిత్రం కథ గురించి ఎంక్వైరీలు మొదలయ్యాయి. మనం, హాయ్, 24 ఇలా వరసపెట్టి విభిన్నమైన కథాంశాలను తన సినిమాలకు ఎంచుకుంటూ వస్తున్న విక్రమ్ కుమార్..ఈ సారి ఏ కథతో రానున్నాడనే చర్చ మొదలైంది.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నాని కాసనోవా పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు ఆరుగురు హీరోయిన్స్ ఉంటారు. ప్రస్తుతం ఆ హీరోయిన్స్ ని ఫైనల్ చేసే పనిలో టీమ్ ఉంది. ప్రక్కింటి కుర్రాడు పాత్రలో కనిపించే నానికి ఇది కొత్త తరహా చిత్రం అవుతుందని భావిస్తున్నాడు.

ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించ‌నుంది. ఈ చిత్రానికి ప్రముఖ డీఓపీ పి.సి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. త్వ‌ర‌లోనే ఈచిత్రం యొక్క పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.

ప్ర‌స్తుతం నాని జెర్సీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి గౌతమ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. నాని ఈ చిత్రాన్ని పూర్తిచేసిన వెంటనే తన 24వ చిత్రాన్ని మొదలుపెట్టనున్నాడు.