వరుస ఫ్లాప్స్ లోనూ నాని వెంట ప్రొడ్యూసర్స్ ఇంతలా ఎందుకు వెంట బడుతున్నారు ?

nani new movie ante sundaraniki title curtai riser

‘వి’ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నాని మరింత స్పీడ్ పెంచేసాడు. వరుసపెట్టి సినిమాల మీద సినిమాలు లాంచ్ చేసేస్తున్నాడు. తాజాగా మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టేసాడు నాని. ఈయన వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఒకటి రెండూ మూడు అంటూ లెక్క పెట్టుకోవాలంతే. ముఖ్యంగా ‘వి’ ఫ్లాప్ అయిన తర్వాత ఈయన సినిమాల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటికే ‘టక్ జగదీష్’ సెట్స్‌పై ఉంది. ఈ చిత్రాన్ని శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నాడు. ‘నిన్ను కోరి’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. దాంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంతో పాటు మరో రెండు సినిమాలు కూడా లైన్‌లో పెట్టాడు ఈయన. ‘టాక్సీవాలా ‘ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో కోల్‌కత్తా నేపథ్యంలో ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాను ఒప్పుకున్నాడు నాని.

ante sundaraniki
ante sundaraniki

ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ పాటికే సినిమా మొదలై విడుదలకు సిద్ధమై ఉండేది. కానీ కరోనా కారణంగా లేట్ అయింది. 2021లో ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉండగానే ఇప్పుడు మరో సినిమా సెట్స్‌పైకి తీసుకొస్తున్నాడు. అదే అంటే సుందరానికి..! మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో వరస విజయాలు అందుకున్న కుర్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ చెప్పిన కథ నచ్చి వెంటనే ఒప్పుకున్నాడు నాని. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

Nani 28 Curtain Raiser | Nani | Nazriya Fahadh | Vivek Athreya | Vivek Sagar | Ante Sundaraniki

గతేడాది మైత్రితో నాని చేసిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ఫ్లాప్ అయింది. దాంతో ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కుంటున్నారు. “అంటే సుందరానికి” కర్టెన్ రైజర్ కూడా విడుదలైంది. ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చేసింది. 100 శాతం నవ్వులు గ్యారెంటీగా ఈ సినిమా ఉండబోతుంది. ఏదేమైనా కూడా నాని జోరు అదరహో అనిపిస్తుందంతే.