లాస్ట్ ఇయర్ ఆరు హిట్స్ తో భాక్సాఫీస్ వద్ద రచ్చ రచ్చ చేసాడు నాని . ఈ 2018లో వరుసగా రెండు ప్లాప్స్ వచ్చేసరికి కంగారుపడి జాగ్రత్తలు తీసుకంటున్నాడు.ఎంతో ఎక్సపెక్ట్ చేసిన దేవదాసు సైతం నిరాశపరిచేసరికి ఖచ్చితంగా కంగారుపుట్టింది. దాంతో నెక్ట్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టలనే కసితో ఉన్నాడు. ప్రస్తుతం పిరియాడిక్ జానర్‌లో తెరకెక్కుతున్న’జెర్సీ’ సినిమాలో నటిస్తున్నాడు.
మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జెర్సీ’ సినిమాలో కన్నడ నటి శ్రద్ధ శ్రీనాధ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు చిత్రయూనిట్. నూతన సంవత్సర కానుకగా జనవరి 1న జెర్సీ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు ప్రీ లుక్ పోస్టర్ లాంటిదొకటి రిలీజ్ చేసారు. ఈ సినిమాలో నాని క్రికెటర్ అర్జున్ పాత్రలో కనిపించనున్నాడు. అందుకే జనవరి 1న అర్జున్‌ని కలవండి అంటూ ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
అందుతున్న సమాచారం ప్రకారం ‘జెర్సీ’ చిత్రానికి నాని రెమ్యూనరేషన్ కూడా తీసుకోవడం లేదు. లాభాల్లో వాటా తీసుకుంటానని నిర్మతలకు చెప్పడం… ఒకవేళ ఈ సినిమా ఆశించిన ఫలితం సాధించకపోతే మరో చిత్రం చేస్తానని మాట ఇవ్వడంతో నిర్మాతలు డీల్ పైనల్ చేసినట్టు తెలుస్తోంది.మొత్తనికి ఈ సినిమా హిట్ అయితేనే నానికి రెమ్యునేషన్ వస్తుంది.తన ఇమేజ్ లో డామేజ్ కంట్రోల్ ఇలా చేస్తున్నాడన్నమాట.
సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. ఏమాత్రం మిస్‌ఫైర్ అయినా ఈ సినిమా కొసం తను పడిన కష్టం వృధా అయిపోవడమే కాదు తన కెరిర్ మరోసారి డైలామాలో పడే పరిస్దితి ఉంది.