నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా విక్రమ్.కె.కుమార్ దర్శకత్వం వహించిన గ్యాంగ్ లీడర్ సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. రిలీజ్ కి ఇంకో ఐదు రోజుల సమయమే మిగిలి ఉంది. ప్రస్తుతం చిత్రబృందం సుడిగాలి ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ శనివారం నాని మీడియా ఇంటరాక్షన్ లో పలు ఆసక్తికర సంగతుల్ని రివీల్ చేశారు. గ్యాంగ్ లీడర్ ఫన్ రైడర్ గా ఉంటుంది. ఇందులో మలుపులు ఆద్యంతం రక్తి కట్టిస్తాయని తెలిపారు. విక్రమ్.కె స్టైల్ క్లాసిక్ సినిమా ఇదని కితాబిచ్చారు. అయితే ఈ సినిమాలో అంత మ్యాటర్ ఉందా? అసలు ఫిలిం మీడియాలో ఏం ముచ్చటించుకుంటున్నారు? అంటే.. చాలానే సంగతులు తెలిసాయి.
తెలుగు సినీమీడియా ఇన్నర్ టాక
గ్యాంగ్ లీడర్ సినిమా ఆద్యంతం నాని మెరుపులు మైమరిపిస్తాయి. సీనియర్ నటి లక్ష్మి నటన పెద్ద ప్లస్ కానుంది. ఐదుగురు మహిళలు ఓ బ్యాంక్ దొంగతనంలో తమ రిలేషన్స్ ని కోల్పోతారు. ఆ తర్వాత అందుకు కారకుడైన విలన్ ని ఛేజ్ చేయడమే వీళ్ల పని. అందుకోసం సినిమా రచయిత అయిన నాని సాయపడుతుంటాడు. ఆ దొంగతనంలో ఐదుగురిని హతమార్చింది కార్తికేయ అని భావించి ఈ గుంపు అంతా వెంటాడుతూ ఉంటారు. అలా పుట్టుకొచ్చే కామెడీ ఎలా కుదిరింది అన్నది తెరపైనే చూడాలి. ఈ సినిమా విక్రమ్ నుంచి వస్తున్న మరో క్లాసిక్ సినిమా. అయితే మాస్ ఎలిమెంట్స్ లేకపోవడం అన్నది పెద్ద మైనస్. ఇందులో కార్తికేయ రోల్ సస్పెన్స్ ఆకట్టుకుంటుంది. అలాగే నాని డబుల్ రోల్ ట్విస్టుతో అసలు కథ పీక్స్ కి చేరుతుంది? ఇందులో ఆ ఐదుగురిని హతమార్చింది ఎవరు? అన్నదే అసలైన ట్విస్టు. జెర్సీ తర్వాత నానీకి మరో తీపి జ్ఞాపకంగా నిలుస్తుందా లేదా.. ఇది క్లాస్ కి చేరుతుందా? మాస్ కి కూడా కనెక్టవుతుందా అన్నది ఇప్పటికి సస్పెన్స్. మీడియాలో గ్యాంగ్ లీడర్ గురించి ఆ మేరకు గుసగుస నడుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.