వైరల్ ఫొటో:వామ్మో బాలయ్య కొడుకు ఏంటి ఇలా ఉన్నాడు?

వైరల్ ఫొటో:వామ్మో బాలయ్య కొడుకు ఏంటి ఇలా ఉన్నాడు?

ఈ రోజు ఉదయం నుంచీ నందమూరి బాలకృష్ణ నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ లుక్ ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . ఆ లుక్ నందమూరి అభిమానులను కంగారుపెడుతోంది . ఈ యేడాది హీరో గా లాంచ్ అవుతాడనుకుంటే ఈ సడెన్ ట్విస్ట్ ఏంటని అంటున్నారు.సాధారణంగా హీరో అనగానే మన మనస్సులో ఓ విజువల్ పడుతుంది. మనం పెద్ద పొట్ట, పైన బట్టతో ఉన్నా తెరపై కనపడే హీరో అంటే స్లిమ్ గా ఉండాలి కానీ మోక్షజ్ఞ మాత్రం ఒళ్లుతో, కొద్దిపాటి పొట్టతో ఉన్నాడు హీరో లుక్ అస్సలు కనిపించడం లేదు ఏ కోశానా చూసినా అని కామెట్స్ చేస్తున్నారు.

అసలు మోక్షజ్ఞ ని 2017 లోనే హీరోగా పరిచయం చేయాలని అనుకున్నాడు బాలయ్య , కానీ మోక్షజ్ఞ కు అంతగా ఆసక్తి లేకపోవడంతో అది వాయిదాపడుతూ వస్తోంది . చాలా కాలం కిందటే త్వరలో మోక్షజ్ఞ సినిమా ప్రారంభమవుతుందని చెప్పిన బాలకృష్ణ, తరువాత సైలెంట్ అయిపోయాడు. అయితే మోక్షజ్ఞకు హీరో అయ్యే ఆలోచన లేదన్న టాక్‌ కూడా గట్టిగానే వినిపిస్తోంది. బిజినెస్‌లో ఎదగాలనకుంటున్న మోక్షజ్ఞ ఇప్పటి వరకు నటన మీద దృష్టి పెట్టలేదన్న ప్రచారం టాలీవుడ్ సర్కిల్స్‌ లో గట్టిగా వినిపిస్తోంది.

ఇటీవల ఒకటి, రెండు సార్లు కెమెరా కంటపడ్డ మోక్షజ్ఞను చూస్తే ఈ వార్తలు నిజమే అనిపిస్తాయి. హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు మోక్షజ్ఞ ఏ మాత్రం సిద్ధంగా లేడన్న విషయం అర్థమవుతోంది. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా మోక్షజ్ఞకు సంబంధించిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఆ ఫోటోలోనూ నందమూరి వారసుడు చబ్బీ చబ్బీగా కనిపిస్తున్నాడు. దీంతో నందమూరి వారసుడి ఎంట్రీ డౌటే అన్న వార్తలు మరింత ఊపందుకున్నాయి. మరి ఇప్పటికైన బాలయ్య మోక్షజ్ఞ తెరంగేట్రంపై క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.