నందమూరి బాలకృష్ణ క్రిష్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ఇప్పుడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నదని , ఎం చెయ్యాలో తెలియక తలలు పట్టుకుంటున్నారని తెలుస్తుంది . ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తెలుగు దేశం పార్టీకి ఎన్నికల్లో వజ్రాయుధంగా పనికొస్తుందని భావించారు . మిగతా వినిమాలను పక్కన పెట్టి బాలకృష్ణ ఈ సినిమా మీదనే ఏకాగ్రతతో పనిచేస్తున్నాడు . ఇక ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత చరిత్ర ను కంగనా రనౌత్ తో “మణి కర్ణిక ” పేరుతో హిందీలో దర్శకత్వం వహిస్తున్న క్రిష్ ఆ సినిమాను మధ్యలో వదిలేసి బాలయ్య పిలుస్తున్నాడని వచ్చేశాడు .
ఈ సినిమాలో విద్యా బాలన్ , రానా, సుమంత్ , కళ్యాణ్ రామ్ , నిత్యా మీనన్ , రకుల్ , తమన్నా , కైకాల సత్యనారాయణ , ప్రకాష్ రాజ్, నరేష్ పూనమ్ బజ్వా ,మంజిమా మోహన్ , హిమన్షి చౌదరి , భరత్ రెడ్డి , నందమూరి మోక్షజ్ఞ లాంటి ఎందరో ఈ సినిమాలో నటిస్తున్నారు .
ఈ సినిమా ఒక సినిమా నిడివి కన్నా ఎక్కువ రావడంతో రెండు భాగాలుగా విడుదల చేస్తున్నామని బాలకృష్ణ ప్రకటించాడు . 2019 జనవరి 9 అన్న ఎన్టీఆర్ ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం (1983 జనవరి 9 ) చేసిన రోజున “ఎన్టీఆర్ మహా నటుడు” అనే సినిమా విడుదల అవుతుందని , జనవరి 24 న “ఎన్టీఆర్ మహా నాయకుడు ” అనే సినిమా విడుదల చేస్తున్నట్టు బాలయ్య తెలిపాడు .
ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాణం కూడా శర వేగంగా జరుగుతుంది . ఇదిలా ఉంటే చంద్ర బాబు కాంగ్రెస్ పార్టీతో కలసి తెలంగాణలో ఎన్నికలకు వెడుతున్నామని చెప్పడం ఆ తరువాత మహాకూటమిలో తెలుగు దేశం పార్టీ చేరటం తెలిసిందే . ఇక చంద్ర బాబు మోడీని ఓడించి రాహుల్ ను ప్రధాని కుర్చీలో కూర్చోబెడతాని ఇటీవలే ప్రకటించాడు . బాబు కేంద్ర రాజ కీయాలొ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు . ఇక్కడే సమస్య వచ్చింది . తెలుగు దేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంతో . తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టడం ఏమిటని తారక రామా రావు 1982 మర్చి 29 న పార్టీని స్థాపించి 9 నెల్ల కాలంలోనే అధికారంలోకి వచ్చాడు . 1983 జనవరి 9 న కాంగ్రెసేతర ముఖ్య మంత్రిగా పదవి భాద్యతలు చెప్పాడు .
ఎన్టీఆర్ ను దించడానికి అప్పటి గవర్నర్ రామ్ లాల్ తో నాదెండ్ల భాస్కర రావును ముఖ్య మంత్రిగా చేసింది కాంగ్రెస్ పార్టీ . ప్రతి పక్షాలతో కలసి పోరాటం చేసి మళ్ళీ ముఖ్య మంత్రి పీఠాన్ని అధిష్టించాడు . ఇక చంద్ర బాబును రాజకీయంగా భూస్థాపితం చెయ్యాలనే ఉద్ద్దేశ్యంతోనే తెలంగాణ రాష్ట్రము ఏర్పాటుకు కాంగ్రెస్ అంగీకరించింది . 2014 జూన్ 2 న ఆంధ్ర ప్రదేశ్ ను రెండుగా చీల్చింది . అల్లాంటి కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడు చంద్ర బాబు పొత్తు పెట్టుకున్నాడు.
మారిన రాజకీయ సమీకరణాలతో ఎన్టీఆర్ బయోపిక్ తీవ్ర ఇబ్బందుల్లో పడిందట. ఎందుకంటే ఈ సినిమాలో కాంగ్రెస్ పార్టీని విమర్శించకూడదు . అయితే ఇప్పటికే ఈ సిన్నివేశాలు అన్నీ తీశారు . వాటన్నింటినీ తొలగించి కొత్త సన్నివేశాలు చేర్చాలి . ఇది ఎలా సాధ్యం . కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ బయోపిక్ లో విలన్. ఆ విలన్ లేకపోతే ?
ఈ సమస్యతో బాలకృష్ణ , దర్శకుడు క్రిష్ ఆందోళనతో వున్నారని తెలిసింది . దీని ప్రభావం బిజినెస్ మీద కూడా పడే అవకాశం ఉన్నట్టు తెలిసింది .