‘బాహుబలి’ స్కీమ్ లోనే   నాగ్ ‘బంగార్రాజు’ స్టోరీ లైన్

సీక్వెల్స్ , ప్రీక్వెల్ తో ఎప్పుడూ ఒక సుఖం ఉంటుంది. బిజినెస్ వెంటనే అయ్యిపోతుంది. ఎందుకంటే హిట్ అయ్యిన సినిమాలకు మాత్రమే సీక్వెల్స్ చేస్తారు. కాబట్టి మళ్లీ హిట్ రిపీట్ అవుతుందని, జనాల్లో హీట్ క్రియేట్ అవుతుందని భావిస్తారు. అదే కోవలో నాగార్జున కూడా తన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాకు  కూడా సీక్వెల్ ప్లాన్ చేసారు. బంగార్రాజు టైటిల్ తో ఆ సీక్వెల్ తెరకెక్కనుంది.  అది ఎప్పటినుంచి వినిపిస్తున్న విషయమే కదా..కొత్తగా చెప్పేదేముంది అంటారా..ఉంది..అది ఈ సినిమాకు అనుష్క సైన్ చేస్తోంది అనే విషయం.

ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయినేకు  ప్రీక్వెల్. అంటే ఆ రోజుల్లో బంగార్రాజు ఎలా ఉండేవాడు అనేది కథ. బంగార్రాజుకు, అనుష్క కు మద్య జరిగే లవ్ స్టోరీ ఈ సినిమాకి హైలెట్ కానుంది. అయితే అనుష్కని వదులుకుని రమ్యకృష్ణని ఎందుకు పెళ్లి చేసుకున్నాడనేది అసలు ట్విస్ట్. అందుకే ఈ సినిమాలో అనుష్క పాత్ర హైలెట్ అవనుంది. అంటే బాహుబలి 2 లో అనుష్క లవ్ స్టోరీ చెప్పినట్లు అన్నమాట.

 ‘సోగ్గాడే చిన్ని నాయన’ తో హిట్ కొట్టి టాలీవుడ్ కు పరిచయమయ్యాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. రెండో సినిమా ‘రా రండోయ్ వేడుక చూద్దాం’ కూడా అక్కినేని కాంపౌండ్ లోనే చేశారు. ఈ రెండు దర్శకుడిగా కళ్యాణ్ కు మంచి పేరు తీసుకొచ్చాయి. కానీ ఈ రెండు హిట్ ను మర్చిపోయేలా చేసింది అతడి తెరకెక్కించిన  ‘నేల టికెట్టు’. ఈ సినిమా  తన్ని ఒక్కసారిగా నేలబారుకి తీసుకొచ్చేసింది.

 కథ కానీ అతడు ఆవిష్కరించిన విధానం గానీ ఏ ఒక్కరినీ ఆకట్టుకోలేకపోయింది. అసలు కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేసిన సినిమానేనా అనే సందేహాలు కలిగాయి.  ఈ నేపధ్యంలో కళ్యాణ్ కృష్ణ చేసిన కొత్త స్క్రిప్టుపై సాధారణంగా అనుమానాలు వచ్చేస్తేయి. అదే జరిగింది. దాంతో కొద్దికాలం పాటు స్క్రిప్టు వర్క్ చేయించి రీసెంట్ గా ఓకే చేసినట్లు సమాచారం. దాంతో ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్కని ఎంపిక చేసినట్లు సమాచారం.