కూతుళ్లను అలా వదిలేయాలి.. నాగబాబు కామెంట్స్ వైరల్

Nagababu emotional On Niharika

ప్రస్తుత కాలంలో ఆడ పిల్లలను పెంచడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. పైగా రక్షణ, సంరక్షణ అంటూ వారికి సవాలక్షణ అడ్డంకులను, పరిధులను పెడుతుంటారు తల్లిదండ్రులు. అయితే కూతుళ్ల విషయంలో అలా చేయోద్దని మెగా బ్రదర్ నాగబాబు చెబుతున్నాడు. తన కూతురు నిహారిక ఓ ఇంటిది కాబోతోన్న సమయంలో నాగబాబు ఒకింత భావోద్వేగానికి గురవుతున్నట్టు కనిపిస్తోంది. అసలే ఈ తండ్రీ కూతుళ్ల ప్రేమ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.

Nagababu emotional On Niharika
Nagababu emotional On Niharika

మెగా ఫ్యామిలీలో నిహారికకు అల్లరి పిల్ల అని పేరుంది. నిత్యం చలాకీగా ఉండే నిహారికకు నిన్న (ఆగస్ట్ 13) చైతన్యతో నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అయితే నిశ్చితార్థం అయిన తరువాత కూతురిపై నాగబాబు చేసే వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. డియర్ చై… నిహారిక దాదాపు అన్ని విషయాల్లో నాలానే ఉంటుందని చాలా మంది చెబుతుంటారు. ఈ ప్రపంచంలోని ప్రేమనంతా ఆమెపై నువ్ కురిపిస్తావని నాకు నమ్మకం ఉంది. ఇక ఈ రోజు నుంచి అధికారికంగా ఆమె నీ సమస్య అయింది అంటూ సరదగా కామెంట్స్ చేశాడు.

ఇక తాజాగా మరో పోస్ట్ చేస్తూ కూతురు గొప్పదనం గురించి వివరించాడు. కూతుళ్లు అనేవారు మనకు ప్రతిబింబాలు. వారిని ఎంతగా పట్టి ఉంచాలని ప్రయత్నిస్తే అన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వారిని వారిలానే ఉండనిద్దాం అలా వదిలేద్దాం..వారు ఎదిగే క్రమంలోని ప్రతీ మూమెంట్‌ను ఎంజాయ్ చేద్దాం. లవ్యూ నిహా అంటూ నాగబాబు ఎమోషనల్ అయ్యాడు.