హీరో గే గోల…పాపం ఆ డైరక్టర్ కి ఎఫెక్ట్ అయ్యింది

                                                               (సూర్యం)

ఈ సినిమా పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో…ఎవరికీ తెలియదు. వరస ఫ్లాఫ్ ల్లో ఉన్న హీరోగారు హఠాత్తుగా హిట్ కొడితే ఆ తర్వాత వచ్చే సినిమాల బిజినెస్ రెట్టింపు అవుతుంది. ఆ దర్శక,నిర్మాతలు పండగ చేసుకుంటారు. అదే ఓ హీరో ప్లాఫ్ కొడితే  ఆ తర్వాత చేసే ప్రాజెక్టుల బిజినెస్ డల్ అయ్యిపోతుంది. హీరో కూడా చాలా కాన్షస్ గా ఉండాలని డైరక్టర్ ని వేపుకు తినేస్తూంటాడు. ఇప్పుడు అదే జరుగుతోందిట నాగశౌర్య తాజా చిత్రం విషయంలో.

నాగశౌర్య రీసెంట్ గా నర్తనశాల అనే పెద్ద డిజాస్టర్ సినిమా ఇచ్చారు. గే గోలతో నిండిపోయిన ఈ సినిమా నాగశౌర్య కెరీర్ కు పెద్ద షాకే ఇచ్చింది. దాంతో అతని తదుపరి చిత్రం డైరక్టర్ ని పిలిచి ..షూటింగ్ ఆపి స్క్రిప్టు తిరగ రాయమని ఆదేశించాడట. రాజా కొలుసు అనే కొత్త డైరక్టర్ ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు.

పాపం అతను బిక్కమొహం పెట్టాడట. కథ చెప్పినప్పుడు అద్బుతం అన్న హీరో …ప్లాఫ్ వచ్చేసరికి ఇలా షూటింగ్ ఆపి…ట్విస్ట్ ఇచ్చాడేంటి అని. నిర్మాతలు కూడా హీరోనే ఫాలో అవుతున్నారట. దాంతో ఎవరినీ ఏమీ అనలేని సిట్యువేషన్. ప్లాఫ్ ఇఛ్చిన హీరోలతో జర్నీ డైరక్టర్స్ కాస్తంత ఇబ్బంది పెట్టే అంశమే. అయితే నాగశౌర్య వైపు నుంచి ఆలోచిస్తే…అతను చేసేది కరెక్టే.