మెగా బ్రదర్ నాగబాబుకు తన కూతురు నిహారిక అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఎన్నో ఇంటర్వ్యూల్లో కుమార్తెపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. అదే విధంగా నిహారికకు సైతం తన తండ్రి అంటే అంతే పంచ ప్రాణాలు. ఇక ప్రస్తుతం వీరిద్దరూ వేరు పడాల్సిన తరుణం వచ్చేసింది. ఈ మధ్యే (ఆగస్ట్ 13) నిహారికకు చైతన్యతో నిశ్చితార్థం అయింది. ఈ క్రమంలో కూతురిని ముందుగా పెళ్లి పీఠలపై చూసే అదృష్టం, దాన్ని అనుభవించే లక్‌ను బాపు బొమ్మకు పెళ్లంట అనే ఈవెంట్ ద్వారా నాగబాబుకు వచ్చింది.
బాపు బొమ్మకు పెళ్లంట అనే ఈవెంట్‌ను జీతెలుగు, అదిరింది షో మెంబర్స్ కలిసి నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌లో నిహారిక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ మేరకు ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమో అయితే నిజంగానే కంటతడి పెట్టించింది. ఇందులో తన కూతురంటే ఎంత ప్రేమో నాగబాబు వివరించాడు.
ఓ ఘటనను నాగబాబు వివరిస్తూ.. ‘ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్ వెళ్లాను.. వాడెవడో నాలాగే నల్ల కోటు వేసుకోవడంతో వాడినే నాన్న అనుకుని వాడితో వెళ్లిపోయింది నిహారిక. దాదాపు 20 నిమిషాల పాటు కనిపించకుండా పోయింది నిహారిక. నాకు బుర్ర పనిచేయలేదు.. నాకు ఎలా అనిపించింది అంటే.. దేశంలో ఉన్న వాళ్లందర్నీ చంపేద్దాం అనుకున్నా.. వరుణ్‌ని ఇంటికి పంపించేసి.. నేను పద్మ సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకున్నాం. నా కూతురు లేకపోతే నేను బతికి ఉన్నా వేస్ట్ అన్నతం పిచ్చ వచ్చేసింది. పుణ్యం చేసుకుంటే వాడి కడుపున ఏంజెల్స్ పుడతారని అంటారు.. నాకు పుట్టిన ఏంజెల్ నా కూతురు నిహారిక’ అంటూ కూతురిపై ప్రేమను కురిపించాడు.