రామావతారంలో ప్రభాస్.. లీక్ చేసిన దర్శకుడు

Nag Ashwin About Prabhas Lord Rama Character In Adipurush

బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్యాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగాడు. సాహో సినిమాతో సత్తాను చాటుకున్నాడు. అయితే అనుకున్నంతగా ఆడకపోయినా.. ప్రభాస్ స్టామినా ఏంటో ఇండియన్ బాక్సాఫీస్‌కు చూపించింది. ఇక ప్రభాస్ ప్రస్తుతం అన్నీ కూడా ప్యాన్ ఇండియా చిత్రాలనే పట్టాలెక్కిస్తున్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణతో రాబోతోన్న రాథేశ్యామ్, నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో రాబోతోన్నది ఇంటర్నేషనల్ లెవెల్ అని తెలుస్తోంది.

ఇక నేడు డార్లింగ్ ఫ్యాన్స్‌కు మాత్రం అదిరిపోయే గిఫ్ట్‌ను ఇచ్చాడు. నేరుగా బాలీవుడ్ ప్రాజెక్ట్‌ను చేయబోతోన్నట్టు ప్రకటించాడు. అది కూడా టీ సిరీస్ వంటి భారీ ప్రొడక్షన్ కంపెనీలో భారీ త్రీడీ పిక్చర్‌ను తెరకెక్కించబోతోన్నట్టు అనౌన్స్ చేశారు. ఆది పురుష్ అంటూ విడుదల చేసిన పోస్టర్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఇక కాసేపటి క్రితమే విడుదల చేసిన మోషన్ పోస్టర్ సైతం అంచనాలను పెంచేస్తోంది.

nag Ashwin About Prabhas Lord Rama Character In Adipurush
nag Ashwin About Prabhas Lord Rama Character In Adipurush

అయితే మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన ఓ ట్వీట్ మాత్రం డార్లింగ్ ఫ్యాన్స్‌లో ఆనందం రెట్టింపైంది. ఆది పురుష్ అంటే ప్రభాస్ ఎలాంటి పాత్రను పోషించబోతోన్నాడో అంటూ ఫ్యాన్స్ రకరకాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలన్నింటిని నాగ్ అశ్విన్ పటాపంచలు చేసేశాడు. ప్రభాస్ రాముడి పాత్రను పోషించబోతోన్నట్టు ప్రకటించాడు. దీంతో అందరకీ ఓ అంచనా వచ్చేసింది. ఇక రాముడి పాత్రలో ప్రభాస్‌ను ఊహించేసుకుంటున్నారు ఫ్యాన్స్.