(ధ్యాన్)
హరికృష్ణ ఇండస్ట్రీలో చాలా మందిని అన్నా, తమ్ముడు,బాబాయ్ అనే పిలిచేవారు. ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచీ ఉన్నారు. ఇప్పుడు పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఆయన నిత్యం `అన్నా` అని మురళీమోహన్‌ని పిలిచేవారు. సినిమా నటుడు మురళీమోహన్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఎన్టీఆర్‌తో, ఆ తర్వాత చంద్రబాబునాయుడుతో సన్నిహితంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు మురళీమోహన్ దగ్గరయ్యారు. అప్పటి నుంచి ఎప్పుడు కనిపించినా అన్నా అని పిలిచేవారట. ఈ విషయాన్ని మురళీమోహన్ గుర్తుచేసుకున్నారు. “నన్నెప్పుడూ మురళీమోహన్ అని గానీ, మురళీమోహన్‌గారూ.. అనిగానీ ఆయన ఎప్పుడూ పిలవలేదు. బోళా మనిషి. ఉన్నదున్నట్టు మాట్లాడేవాడు. ఆయన్ని విగతజీవుడిగా చూడటం బాధ కలిగించింది“ అని అన్నారు.