బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషాదకర మరణం ఎన్నో విషయాలపై చర్చకు దారి తీసింది. సినీ పరిశ్రమలో స్వపక్షం .. అభిమానవాదంపై నిరంతరాయంగా చర్చ సాగుతోంది. పరిశ్రమలో సినీకుటుంబ నేపథ్యం లేదా గాడ్ ఫాదర్ లు లేని పలువురు ‘బయటి’ నటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం ఎలాంటి సవాళ్లతో కూడుకున్నదో ఇప్పటికే సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి విధితమే.
తాజాగా పరిశ్రమ కష్టాలు రాజకీయాలు కుట్రలపై ముంబై హీరోయిన్ శ్రద్ధాదాస్ మీడియాతో ముచ్చటించింది. తెలుగు, హిందీ మరియు బెంగాలీ సినిమాల్లో ప్రయత్నాలతో అలసిసొలసిపోయిన అందాల భామ శ్రద్ధా దాస్, సరైన అవకాశాలను పొందడంలో కుటుంబ నేపథ్యం లేని బయటి వ్యక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విశదపరిచింది. నేపథ్యం లేకుండా, తనలాంటి నటీనటులు ఒక సినిమాలో ఒక చిన్న పాత్రను పొందటానికి వేలాది ఆడిషన్లు ఇవ్వవలసి ఉంటుందని.. నేపథ్యం ఉన్న వ్యక్తి దాన్ని వెంటనే పొందుతాడని అందుకు తన బలగం సహకరిస్తుందని వెల్లడించింది.
నేపథ్యం లేని చాలా మంది నటీనటు లు స్టార్ ఫిల్మ్‌మేకర్స్ ను చేరుకోవడం లేదా వారి సినిమాలకు ఆడిషన్ అవకాశం పొందడం కూడా అసాధ్యమని శ్రద్ధా అన్నారు. “నేపథ్యం ఉన్నవారికి మొదటి రోజు నుండి రెడ్ కార్పెట్ స్వాగతం లభిస్తుంది“ అని శ్రద్ధా తెలిపారు. ఇండస్ట్రీ పెద్దవాళ్ళు తమ పద్ధతిని కనీసం ఇప్పుడైనా మార్చుకుంటారని ఈ రంగంలో కష్టపడుతున్న బయటివారికి అవకాశాలిస్తారని ఆశిస్తున్నాను అని తెలిపింది.
బ్యాక్ గ్రైండ్ లేకుండా ఓ సినిమాలో ఒక చిన్న అతిధి పాత్ర కోసం 1000 పైగా ఆడిషన్స్ ఇవ్వవలసి వచ్చింది. పైగా ప్రోత్సాహం జీరో. అయితే సినీకుటుంబ నేపథ్యం బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారు దాన్ని వెంటనే పొందుతాడు అని వెల్లడించింది. అన్నట్టు టాలీవుడ్ లో శ్రద్ధా ఎందుకని వెనకబడింది. బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వల్లనేనా?