శివ‌గామి ఆమె పాత్ర‌కు న్యాయం చేస్తుందా?

                                                    (ధ్యాన్)

రాజ‌మౌళి విజువ‌ల్ వండ‌ర్ `బాహుబ‌లి`లో ప్ర‌తి పాత్ర‌కు ఓ గుర్తింపు ద‌క్కింది. అందులో రాజమాత శివ‌గామి పాత్ర గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ర‌మ్య‌కృష్ణ అద్భుత‌మైన న‌ట‌న‌తో పాత్ర‌కు ప్రాణం పోసింది. ఈ పాత్ర‌కు ఉన్న ప్రాధాన్య‌త‌ను మ‌రింత ఇనుమ‌డింప చేయ‌డానికి నెట్‌ఫిక్ల్స్ సంస్థ ఆనంద్ నీల‌కంఠ‌న్ ర‌చించిన పుస్త‌కం ఆధారంగా `ది రైజ్ ఆఫ్ శివ‌గామి` సిరీస్‌ను రూపొందిస్తుంది. రాజ‌మౌళి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో దేవాక‌ట్టా, ప్ర‌వీణ్ స‌త్తారు ఈ సిరీస్‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సిరీస్‌లో శివ‌గామి పాత్ర‌లో మృణాల్ థాకూర్ న‌టిస్తున్నారు. తొలి చిత్రం `ల‌వ్ సోనియా`తో గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ థాకూర్‌కి మ‌రో మంచి ముందుఅడుగు ద‌క్కినేట్టేన‌ని భావిస్తున్నారు. అయితే న‌టిగా ర‌మ్య‌కృష్ణ‌కు ఉన్న అనుభ‌వంతో ఆమె శివ‌గామి పాత్ర‌కు ప్రాణ ప్ర‌తిష్ట చేశారు. ప్రేక్ష‌కులు శివ‌గామి అంటే రమ్య‌కృష్ణ మాత్ర‌మే అనేంత గొప్ప‌గా పాత్ర‌లో ఇమిడిపోయారు. మ‌రిప్పుడు ఒకే ఒక సినిమా మాత్ర‌మే చేసిన మృణాల్ థాకూర్ ఆ పాత్ర‌కు ఏ మేర న్యాయం చేస్తుందా? అనే సందేహం ప్రేక్ష‌కుల్లో ఉండ‌కుండా ఉంటుందా?  మ‌రి మృణాల్ యువ శివ‌గామిగా ఎలా మెప్పిస్తుందో..!