మెహన్ లాల్ నటిస్తున్న అత్యంత భారీ సినిమా “ఓడియన్”. ఈ చిత్రానికి తెలుగు కూడా చాలా మంచి క్రేజ్ వుంది. ఈ చిత్రం కోసం మెహన్ లాల్ యెగా మరియు వ్యాయామాలు చేసి తన వయసుని 55 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు కనిపించేలా శరీరాన్ని మార్చుకొని నటించిన చిత్రం కావటం.. అద్బుతమైన గ్రాఫిక్స్ తో నిర్మిస్తుండటంతో ఈ ప్రాజెక్టు కి క్రేజ్ వచ్చింది. టాలీవుడ్ కి సంబంధించిన చాలా మంది నిర్మాతలు పోటిపడినా దగ్గుపాటి ఫ్యామిలీకి చెందిన దగ్గుపాటి అభిరామ్ , సంపత్ కుమార్ ఈ చిత్రం తెలుగు హక్కులుతీసుకున్నారు . ఈ అవకాశాన్ని అందించిన మెహన్ లాల్ కు నిర్మాతలు ధన్యవాదాలు తెలియజేసారు. ఈ చిత్రాన్ని మలయాళం, తెలుగులో ఏకకాలంలో విడుదల చేయనున్నారు
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ…. మోహన్ లాల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన స్టామినా ఎంతో చాలా సినిమాల్లో చూసాం. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో ఆయన నటిస్తున్న ఓడియన్ చిత్ర తెలుగు హక్కుల్ని మా దగ్గుబాటి క్రేయేషన్స్ సొంతం చేసుకోవడం ఆనందంగా వుంది . దర్శకుడు శ్రీ కుమార్ మీనన్ మోహన్ లాల్ గారిని 35 సంవత్సరాల వయసున్న వైవిధ్యమైన పాత్రలో చూపించనున్నారు. దీనికోసం మోహన్ లాల్ గారు యోగాసనాలు 55 చేయడం నిజంగా గొప్ప విషయం . పీటర్ హెయిన్స్ యాక్షన్, అద్భుతమైన గ్రాఫిక్స్ మెస్మరైజ్ చేస్తాయి. అన్నారు. మరో మలయాళ సినిమా తెలుగులోకి వస్తేస్తుంది .