ప్రభాస్ సినిమాలో సీనియర్ స్టార్ హీరో

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ఏకైక స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్. టాలీవుడ్ అనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా క్రేజ్ అందుకుంటున్న పవర్ఫుల్ హీరో అనే చెప్పాలి. అయితే ప్రభాస్ ఇటీవల KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేయనున్నట్లు ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇక సినిమా స్థాయిని మరింత పెంచేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ మరో పవర్ఫుల్ స్టార్ హీరోను కూడా రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు. మళయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్. కంప్లీట్ యాక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న మోహన్ లాల్ ప్రస్తుతం దృశ్యం సీక్వెల్ తో బిజీగా ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ తో గతంలో జనతా గ్యారేజ్ లో నటించి తెలుగు ఆడియెన్స్ కు దగ్గరైన ఆయన ప్రభాస్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్.

ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాను పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక KGF సెకండ్ పార్ట్ విడుదలైన అనంతరం దర్శకుడు ప్రశాంత్ సలార్ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టనున్నాడు. సినిమాకి సంబంధించిన ఫుల్ స్క్రిప్ట్ కూడా సిద్ధమైనట్లు సమాచారం. మరోవైపు ప్రభాస్ ఓం రావత్ ఆది పురుష్ సినిమాతో పాటు నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ సినిమాను చేయనున్న విషయం తెలిసిందే. మరి ఈ బిగ్ బడ్జెట్ సినిమాల కోసం ప్రభాస్ ఏ విధంగా షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకుంటాడో చూడాలి.