తెలుగు సినిమాల్లో తనదైన మార్కున్న కొద్ది మంది హీరోలలో మోహన్ బాబు ఒకరు. ఆయన మాట శైలి విలక్షణం గా ఉంటుంది. డైలాగును అందిరిలాపలకకుండా తన శైలిలోకి మార్చకుని చెప్పడంలో ఆయన దిట్ట. ఇటీవల ఒక జాతీయ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తనదైన శైలిలో మాట్లాడి ఒక పద ప్రయోగం చేసి సంచలనం సృష్టించారు.
తాను నటించిన ఎం ధర్మరాజు ఎంఎ సినిమాలోని ఒక డైలాగును ఆయన ఇంగ్లీష్లో కి అనువాదం చేసి చెప్పాల్సి వచ్చింది. ఇంగ్లీష్ అయితేనేం, తెలుగయితేనేం, మోహన్ బాబు ముద్ర పడాల్సిందే. ఆముద్ర ‘ఫసక్’ అనే మాట. అది సోషల్ మీడియాలో వైరలయ్యింది. ఇది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కొందరు ఎగతాళిచేశారు, కొద్దరు నవ్వుకున్నారు. దీనిమీద లెక్కలేనన్నిస్పూఫ్ లు, ఫన్నీ వీడియో లు వచ్చాయి. ఈ వ్యవహారం మీద మొత్తానికి మోహన్ బాబు స్పందించారు.
“ఫసక్` ట్రెండింగ్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ మాట ఆధారంగా దాదాపు 200 స్పూఫ్ వీడియోలు వచ్చినట్టు విష్ణు చెప్పాడు. కొన్నింటిని చూశాను. చాలా సృజనాత్మకంగా, ఫన్నీగా ఉన్నాయి`అని మోహన్‌బాబు ట్వీట్ పెట్టారు.
#fasak Good to know it’s trending! @iVishnuManchu tells me there are minimum 200 spoof videos! Saw some, really innovative and funny!
— Mohan Babu M (@themohanbabu) September 3, 2018