మంచు ఫ్యామిలీకి సోషల్ మీడియాలో ఉన్న రెప్యుటేషన్ ఎలాంటిదన్నది అందరికీ తెలిసిందే. ఈ విషయంలో మంచు మోహన్ బాబు సైతం ఇటీవలే ఒక కార్యక్రమంలో ఓపెన్ గా మాట్లాడేశారు. తమ గురించి తమాషా చేస్తూ పెట్టిన వీడియోలవీ చూస్తుంటానని సరదాగానే మాట్లాడారు. మంచు లక్ష్మి ఈ విషయంపై ఒక సందర్భంలో చాలా సీరియస్ గా స్పందించింది. అయితే మంచు కుటుంబ సభ్యులు స్పందన ఎలా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం వాళ్ల మీద మీమ్స్ ఆగట్లేదు. వాళ్ళు ఎక్కడ దొరుకుతారు అని ఎదురు చూసే జనాలు .. ఏ చిన్న ఆవకాశం దొరికిన చెలరేగిపోతుంట. ఇటీవలే మోహన్ బాబు అలాగే దొరికేశారు
కొన్ని రోజుల కిందట మోహన్ బాబు తన కూతురు లక్ష్మీ తో కలిసి ప్రముఖ పాత్రికేయుడు రాజ్డీప్ సర్దేశాయ్ తో ఇంగ్లీష్ లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాల పై మాట్లాడారు. తన నటనలో ప్రత్యేకతను చాటిచెప్పడానికి ఎం. ధర్మరాజు ఎం.ఏ సినిమాలోని ఒక సన్నివేశాన్ని ఉదాహరణంగా చెప్పారు. అందులో తాను తన భార్యనే చంపమనే డైలాగ్ చెప్పి.. దాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించి చెప్పడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒక్క దెబ్బతో చంపేయాలి అనే మాటను ఇంగ్లీష్ లోకి అనువదిస్తూ … ”డోంట్ కిల్ సో మెనీ టైమ్స్ లైక్ దిస్.. ఓన్లీ ఒన్స్ ఫసక్” అన్నారు. అంతే ఈ ఫసక్ అనే మాట ట్రోలర్స్ పట్టుకున్నారు. దీని మీద ఇబ్బడి ముబ్బడిగా మీమ్స్ వచ్చేసాయి. అవి సోషల్ మీడియాలో జనాలకు మాములుగా ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వట్లేదు. యూట్యూబ్ లోకి వెళ్లి ”ఫసక్” అని కొడితే కుప్పలు కుప్పలుగా మీమ్ వీడియోస్ వస్తున్నాయి.
మోహన్ బాబు ఇంటర్వ్యూ (11.40 సెకండ్స్)