ఆర్జీవీ వ‌ర‌ల్డ్‌లో 8 పీఎం టుడే క్లైమాక్స్

Mia Malkova RGV Climax

వివాదాస్ప‌ద దర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఏం చేసినా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వివాదంతో ఉచిత‌ ప్ర‌చారం ఆయ‌న‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. ఇక ఇటీవ‌లి కాలంలో వేడెక్కించే క‌వ్వించే సినిమాల‌తో ప్ర‌చారం కొట్టేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆర్జీవీ వ‌రల్డ్ అంటూ డిజిట‌ల్లోనూ ప్ర‌వేశించి మ‌రింత‌గా వేడెక్కించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు.

ప్ర‌స్తుతం ఆయ‌న ఓటీటీ కోసం తెర‌కెక్కించిన `క్లైమాక్స్`ని ఆర్జీవీ వ‌ర‌ల్డ్ అనే యాప్ లో రిలీజ్ చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. ఇప్ప‌టికే క్లైమాక్స్ టీజ‌ర్ ట్రైల‌ర్ యూత్ ని విశేషంగా ఆక‌ర్షించాయి. శృంగార తార మియా మ‌ల్కోవా అందాల విందు థియేట‌ర్ల‌ను మండించ‌డం ఖాయం అన్న టాక్ వ‌చ్చింది. అయితే ఈ సినిమాని థియేట‌ర్ల‌లో కాకుండా యాప్ లో రిలీజ్ చేస్తుండ‌డంతో మ‌రింత‌గా యువ‌త‌రానికి చేరువ అవుతుంద‌ని భావిస్తున్నారు.

ఇంత‌కీ క్లైమాక్స్ ఎప్పుడు ఎక్క‌డ రిలీజ‌వుతోంది? అంటే.. ఆర్జీవీ వ‌ర‌ల్డ్ అనే యాప్ ని ప్లేస్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని అక్క‌డ వీక్షించ‌వ‌చ్చ‌ట‌. నేటి (జూన్ 6) సాయంత్రం 8 గంట‌ల‌కు క్లైమాక్స్ సినిమాని ఈ యాప్ లో రిలీజ్ చేస్తున్నారు ఆర్జీవీ. ఇప్ప‌టికే త‌న నిర్మాత‌ల‌తో ప్ర‌చారం కూడా చేయించేస్తున్నారు. క‌రోనాని ఎదుర్కోవాలంటే ఆర్జీవీ క్లైమాక్స్ చూడాలంటూ ప్ర‌చారం హోరెత్తించేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం.

CLIMAX Movie Online Theater RGVWORLD లో jun 6th 8pm కి  విడుదల || మీ రామసత్యనారాయణ