Rana: 1945 సినిమా క్లైమాక్స్ ,ప్రమోషన్స్ ను నిర్వహించకపోవడం అసలు.. కారణం అదేనా?

Rana: టాలీవుడ్ హీరో రానా నటించిన చిత్రం1945. బాహుబలి సినిమా తర్వాత రానా హీరోగా బ్రిటిష్ పాలన నేపథ్యంలో రూపొందిన దేశభక్తి చిత్రం 1945. తాజాగా విడుదలైన ఈ సినిమా భారీగా ఉంటుంది అని ప్రేక్షకులు ఆశపడి మరి సినిమా థియేటర్లకు వెళ్లారు కానీ ప్రేక్షకులు 1945 తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాకి, తనకి ఎటువంటి సంబంధం లేదని రానా ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాలేదు. కేవలం క్యాష్ చేసుకోవడానికి ఫస్ట్ లుక్ ని మాత్రమే రిలీజ్ చేశారు. దయచేసి ఈ సినిమాను ఎంకరేజ్ చేయకండి అంటూ రానా గతంలో ఆవేదన వ్యక్తం చేశాడు.

సినిమా షూటింగ్ పూర్తి అయిందా లేదా అన్నది డిసైడ్ చేయాల్సింది దర్శకుడు అంటూ నిర్మాత రానాకి స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చాడు. ఈ క్రమంలోనే రానా ఆ సినిమాకు తనకు ఎటువంటి సంబంధం లేదు అని బహిరంగంగా జనాలకు చెప్పడం నచ్చలేదు. అయితే ఎన్నో అవాంతరాలను అధిగమించి, ఎన్నోసార్లు వాయిదా పడుతూ, నానా గొడవలన్నీ ఎదుర్కొని చివరకు సి.కళ్యాణ్ పుణ్యమా అని ఈ సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు తమిళ దర్శకుడు సత్య శివ దర్శకత్వం వహించారు. అలాగే టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అయినా సి.కళ్యాణ్ తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న గానే మధ్యలో ఆగిపోయింది. మధ్యలో ఈ సినిమా గురించి ఎక్కడ వార్తలు వినిపించలేదు.

అయితే ముందుగా ఈ సినిమాని డిసెంబర్ 31 న విడుదల చేయాలి అని అనుకున్నారు. కానీ సంక్రాంతి బరిలో నుంచి ఆర్ఆర్ఆర్ తప్పుకోవడంతో జనవరి 7న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. అసలు ఈ సినిమా షూటింగ్ కూడా సరిగా పూర్తవలేదు. అసలు ఈ సినిమాకి క్లైమాక్స్ అనేది లేదు. సాధారణంగా దేశ భక్తి కలిగిన సినిమాలు అంటే ఎమోషనల్ కలిగిన సన్నివేశాలు ఉంటాయి. కానీ ఈ సినిమాలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఎమోషనల్ సన్నివేశాలు లేదు అంటే దర్శకుడు ఈ సినిమాను ఇంత కామెడీగా తీశాడు అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి ఈ సినిమాను చూసిన తర్వాత హీరో రానా ఆవేదన కరెక్టే అని అంటున్నారు. ఇందులో మంచి మంచి నటులు ఉన్నా కూడా దర్శకుడు వారిని సరిగా వాడుకోలేదు.