మెగాబ్ర‌ద‌ర్స్ స‌ర్‌ప్రైజింగ్ బ‌ర్త్‌డే కానుక‌లు

ఫ్యాన్స్‌కి అదిరిపోయే మెగా ట్రీట్

ఆగ‌స్టు 22.. సెప్టెంబ‌ర్ 2 .. ఈ రెండు తేదీల‌కు ఉన్న ప్ర‌త్యేక‌త ఏమిటో మెగాభిమానుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నే లేదు. ఆగ‌స్టు 22 అన్న‌య్య చిరంజీవి బ‌ర్త్ డే అయితే సెప్టెంబ‌ర్ 2న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన‌రోజు. ఆ రెండు తేదీల కోసం మెగా ఫ్యాన్స్ ఏడాది కాలం ఆస‌క్తిగా వేచి చూడ‌డం అల‌వాటు.

2020 ఆశ‌ల్ని గ‌ల్లంతు చేసి గంద‌ర‌గోళం సృష్టించింది. ఇలాంటి టైమ్ లోనూ అన్న‌ద‌మ్ములిద్ద‌రూ క్రేజీగా సినిమాల‌తో సంద‌డి చేసేందుకు సిద్ధంగా ఉండ‌డంతో ఫ్యాన్స్ లో ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది. మెగాస్టార్ చిరంజీవి కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య చిత్రంలో న‌టిస్తుండ‌గా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ రీఎంట్రీలో వ‌రుస‌గా రెండు సినిమాలు ప్రారంభించేసారు. వ‌కీల్ సాబ్ తో పాటు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలోని సినిమా సెట్స్ పై ఉన్నాయి. మ‌హ‌మ్మారీ వ‌ల్ల తాజా షెడ్యూల్స్ వాయిదా ప‌డినా మెగా బ్ర‌ద‌ర్స్ షూటింగులు ఎప్పుడెప్పుడు పూర్తి చేయాలా? అన్న ఆత్రుత‌తో ఉన్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజున (ఆగ‌స్టు 22) న ఆచార్య ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేస్తార‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ కోసం కొర‌టాల ఎంతో ప్లాన్డ్ గా ఉన్నార‌ట‌. మెగా ఫ్యాన్స్ కి అదిరిపోయే విజువ‌ల్ ట్రీటిచ్చే కానుక ఇద‌ని చెబుతున్నారు. అలాగే సెప్టెంబ‌ర్ 2న ప‌వ‌న్ బ‌ర్త్ డే కానుక వ‌కీల్ సాబ్ కొత్త లుక్ స‌హా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలోని హిస్టారిక‌ల్ మూవీ టైటిల్ ని అలాగే ఫ‌స్ట్ లుక్ ని లాంచ్ చేస్తార‌ని తెలుస్తోంది. ఈ మూవీలో ప‌వ‌న్ బందిపోటు లుక్ పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఫస్ట్ లుక్ సూపర్ స్పెషల్ గా ఉంటుందని ప్ర‌చార‌మ‌వుతోంది. ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్త‌వ్వ‌గా.. మ‌హ‌మ్మారీ తగ్గిన తరువాత, యూనిట్ తిరిగి షూటింగ్ ప్రారంభించాలని యోచిస్తోంది.