మెగా లీక్ : చిరు “గాడ్ ఫాదర్” నుంచి షాకింగ్ సీన్ లీక్ అయ్యిపోయింది.!

ఈ ఏడాది టాలీవుడ్ దగ్గర ఘోరమైన ప్లాప్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా వారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు నటించిన చిత్రం “ఆచార్య” కూడా ఒకటి. భారీ స్థాయిలో నష్టాలు మిగిల్చిన ఈ చిత్రం మెగాస్టార్ మార్కెట్ కి మాత్రం బాగా దెబ్బ తీసింది అని చెప్పాలి.

మరి దీనితో మెగాస్టార్ నెక్స్ట్ సినిమాలపై హైప్ తగ్గిందా అనుకుంటే మెగా ఫ్యాన్స్ మాత్రం అలా కనిపించడం లేదు. మరి మొదటి రిలీజ్ కి ఈ ఏడాదిలోనే వస్తున్న చిత్రం “గాడ్ ఫాదర్” కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ భారీ మల్టీ స్టారర్ నుంచి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ సీన్ లీకయ్యి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ ఇద్దరు మెగాస్టార్స్ కలిసి క్లైమాక్స్ లో అదిరే యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నట్టుగా ఓ ఫోటో లీక్ అయ్యి బయటకి వచ్చింది. దీనితో మన తెలుగులో కంటే బాలీవుడ్ లో ఈ సీన్ మంచి వైరల్ గా మారిపోయింది.

మొత్తానికి అయితే ఈ మెగా లీక్ తో హిందీలో కూడా మంచి హైప్ వచ్చింది. మరి హిందీలో ఈ సినిమాకి ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో చూడాలి. మరి ఈ సినిమాలో నయనతార ఫీమేల్ లీడ్ లో నటించగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.