(ధ్యాన్)
రామ్‌చరణ్ మీద మెగా ఫ్యాన్స్ హర్టు.. బుంగమూతి పెట్టేసుకున్నారు. హర్టంటే హర్టంతే. లేకపోతే అప్పుడెప్పుడో ఆగస్టు 22కే చెప్పాల్సిన మాటని చెప్పలేదు. పోనీ బాబాయ్ మీద ప్రేమతో లోపల దాచుకున్నాడేమో. తర్వాత చెప్తాడేమో అనుకుంటే.. అదీ చెప్పలేదు. మరి హర్టుకాక ఇంకేటవుతారేంటి?.. అందుకే హర్టు.. ఇంతకీ దేనికి హర్టు? రామ్ చరణ్ తండ్రి కాబోయే వార్తను షేర్ చేసుకోవాలనుకున్నాడా? ఏంటి? అని అనుకుంటున్నారా? కాస్త ఆగండి.. ఇక్కడ విషయం పర్సనల్ కాదు. ప్రొఫెషనల్. అంటే రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు రాజసం, రాజవంశస్థుడు, జగదేకవీరుడు, హీరో వంటి పేర్లను పరిశీలిస్తున్నారు. వాటిల్లో ఒక పేరును చిరు బర్త్ డే కి విడుదల చేస్తారని అభిమానులు ఎదురుచూశారు. కానీ చేయలేదు. మరలా పవన్ కల్యాణ్ బర్త్ డే కైనా ప్రకటిస్తారేమోనని చూశారు. అదీ లేకపాయె. దాంతో ఉస్సూరుమంటున్నారు. కనీసం వినాయకచవితికైనా విడుదల చేస్తారేమోనని ఎదురుచూస్తున్నారు. బోయపాటి సినిమాలంటే యాక్షన్‌కి కొదవే ఉండదు. పైగా ఫస్ట్ లుక్ తప్పకుండా స్పెషల్‌గానే ఉంటుంది. అందుకే తమ మెగాపవర్ స్టార్‌ని బోయపాటి ఎలా చూపిస్తారేమోనని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారన్నమాట.