ప్ర‌భాస్ ఇలాకాలో మెగా ఫ్యాన్స్ హంగామా

చిరు క‌టౌట్ ని షేర్ చేసిన ఉపాస‌న‌

ప్ర‌భాస్ ఇలాకా  భీమ‌వ‌రంలో మెగాస్టాన్ ఫ్యాన్స్ హంగామా ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. `సైరా` రిలీజ్ సంద‌ర్భంగా భీమ‌వ‌రం మెగా అభిమానుల్లో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ `సైరా న‌రసింహారెడ్డి`. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ చిత్రం కోసం భీమ‌వ‌రంలో చిరు అభిమానులు సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. `ఖైదీ నంబ‌ర్ 150` త‌రువాత చిరు నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా రిలీజ్ ధీయేట‌ర్ల ముందు భారీ క‌టౌట్ లు ఏర్పాటు చేశారు. భీమవ‌రంలో చిరంజీవికి సంబంధించిన 250 అడుగుల భారీ క‌టౌట్‌ని ఏర్పాటు చేయ‌డం విశేషం.
 
అంతే కాకుండా అర కిలోమీట‌రు మేర `సైరా` పోస్ట‌ర్ల‌తో అబ్బుర‌పడే స్థాయిలో బ్యాన‌ర్‌ని ఏర్పాటు చేసి త‌మ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ బ్యానర్‌తో పాటు చిరు క‌టౌట్‌ని సోష‌ల్ మీడియాలో చూసిన చిరు కోడ‌లు ఉపాస‌న మెగాస్టార్ అభిమానుల‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా `మీ ప్రేమాభిమానాల‌కు ధ‌న్య‌వాదాలు` అని ట్వీట్ చేశారు. సైరా భారీ క‌టౌట్‌తో పాటు అర కిలోమీట‌రు మేర ఏర్పాటు చేసిన బ్యాన‌ర్‌ని ఉపాస‌న త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేయ‌డంతో చిరు భారీ క‌టౌట్ వైర‌ల్‌గా మారింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే సాహో రిలీజ్ స‌మ‌యంలో ప్ర‌భాస్ క‌టౌట్ ఫ్లెక్సీల్ని ఇలానే వీధి పొడ‌వునా కిలోమీట‌ర్ పొడ‌వు ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే.