A – ఆదిపురూష్ : ప్రభాస్ దెబ్బకి మెగా ఫామిలీ కి 1500 కోట్ల నష్టం ??

mega family dream project may be shelved because of prabhas

గత రెండు మూడు రోజుల నుంచి ప్రభాస్ బాలీవుడ్ మూవీ ఏ – ఆదిపురుష్ మీదనే చర్చ. ప్రభాస్ తొలిసారిగా డైరెక్ట్ బాలీవుడ్ మూవీ చేస్తుండటం ఒకటైతే.. ఆ సినిమా కథ రామాయణం ఇతిహాసం మీద ఉండటం. అందులోనూ ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తుండటం.. ఇదంతా ఓ కలలా అనిపించినా.. ఆ కలను నిజం చేయబోతున్నారు ప్రభాస్.

mega family dream project may be shelved because of prabhas

ఇక.. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో.. టాలీవుడ్ లో ప్రకంపనలు ప్రారంభం అయ్యాయి. ఒక టాలీవుడ్ హీరో అంత భారీ ప్రాజెక్ట్ లో నటించడం అంటే మాటలా? నిజానికి ప్రభాస్ ఇప్పుడు ఒక్క టాలీవుడ్ హీరో మాత్రమే కాదు.. ఆయన పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తున్నారు. నేషనల్ స్టార్ ఆయన.

అయితే.. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇంకోటి ఉన్నది. మీకు గుర్తున్నదా? గత సంవత్సరమే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. ఓ పెద్ద ప్రాజెక్ట్ ను ప్రకటించారు. అది కూడా రామాయణం మీదనే. పేరు కూడా రామాయణం అని ఫిక్స్ అయ్యారు. 1500 కోట్ల బడ్జెట్ తో దాదాపు మూడు పార్టులుగా ఆ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేశారు అరవింద్.

ఆ చిత్ర నిర్మాణం కోసం అల్లు అరవింద్.. నమిత్ మల్హోత్ర లాంటి బిగ్ ప్రొడ్యూసర్ తో జతకట్టారు. దంగల్, చిచోరే ఫేమ్ నితీశ్ తివారితో ఆ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ తో పాటుగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ దీపికా పదుకొణె ను పెట్టి ఆ సినిమా తీయాలని అనుకున్నారు. ఆ ప్రాజెక్ట్ ను అనౌన్స్ అయితే చేశారు కానీ.. ఆ తర్వాత ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి అప్ డేట్ రాలేదు.

ఇంతలోనే ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ప్రకటించడం.. అది కూడా రామాయణం మీదనే ఉండటంతో మెగా ఫ్యామిలీ 1500 కోట్ల ప్రాజెక్ట్ ఇక అటకెక్కినట్టే అని సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

ప్రస్తుతం ఉన్న అన్ని సాంకేతిక నైపుణ్యాలను ఉపయోగించుకొని 3డీ టెక్నాలజీతో ఆదిపురుష్ వస్తుండటంతో తన 1500 కోట్ల రామాయణం ప్రాజెక్టును పక్కనపెట్టడం తప్పితే మరో ప్రయోజనం లేదని అల్లు అరవింద్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ సమయంలో అంత భారీ ప్రాజెక్ట్ తీయడం కష్టమని భావించి.. తన కొత్త ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా పైనే ఆశలు పెట్టుకున్నాడని ఫిలింనగర్ టాక్.

అయితే.. రామాయణం ప్రాజెక్ట్ అనౌన్స్ తర్వాత మళ్లీ దాని గురించి ఎటువంటి అప్ డేట్ ఇవ్వని అల్లు అరవింద్.. ప్రభాస్ ఆదిపురుష్ ప్రకటించిన తర్వాత అయినా స్పందిస్తారా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.