మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల నిశ్చితార్థం హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ హోటల్లో పూర్తయిన సంగతి విధితమే. ఈ వేడుకకు కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి – సురేఖ దంపతులు సహా రామ్ చరణ్ – ఉపాసన జంట.. అల్లు అర్జున్ – స్నేహారెడ్డి జంట ఈ వేడుకలో సందడి చేయగా .. ప్రభాస్ .. వరుణ్ తేజ్.. సాయి తేజ్.. తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.
ఇక వరుడు చైతన్య జొన్నలగడ్డ తరపు బంధుమిత్రులు ఈ వేడుకలో సందడి చేసారు. గురువారం నిశ్చితార్థ వేడుక అనంతరం సోషల్ మీడియాల్లో నాగబాబు.. వరుణ్ తేజ్ స్వయంగా వేడుకకు సంబంధించిన ఫోటోల్ని షేర్ చేయడమే గాక కాస్త ఉద్వేగభరితంగానే స్పందించారు.
నా బేబి నిశ్చితార్థం చేసుకుంది.. బావ గారికి స్వాగతం అంటూ వరుణ్ ఏమోషన్ కాగా.. నాగబాబు అంతే ఇదిగా ఎమోషన్ కి గురయ్యారు. “ప్రతి ఒక్కరు చెబుతుంటారు .. నిహారిక చాలా విషయాల్లో అచ్చం నాలాగే ఉంటుందని! తనను నువ్వు(చైతన్య) అపారమైన ప్రేమతో చూసుకుంటావని నాకు నమ్మకం ఉంది. నేటి నుంచి ఆమె అధికారికంగా నీ సమస్య“ అంటూ సరదాగా అల్లుడినుద్ధేశించి వ్యాఖ్యానించారు. ఈ నిశ్చితార్థ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి- సురేఖ పెద్దలుగా వ్యవహరించారు.