టాలీవుడ్ లోగుట్టు బ‌య‌ట‌పెట్టే `క‌మిట్మెంట్`

Tejaswi Madivada

                         #మీటూ వివాదంపై `క‌మిట్మెంట్` వెబ్ సిరీస్

#మీటూ వివాదంలో క‌మిట్మెంట్ అన్న ప‌దం ఎక్కువ‌గా వినిపించింది. ప‌లువురు క‌థానాయిక‌లు ప‌రిశ్ర‌మ‌లో క‌మిట్మెంట్ వ్య‌వ‌హారాల‌పై ఓపెన‌య్యారు. దానిపై పోలీస్ విచార‌ణ‌తో పాటు కోర్టుల ప‌రిధిలో విచార‌ణ సాగింది.

ఇండ‌స్ట్రీలో మీటూ వ్య‌వ‌హారాల‌కు.. స్పైసీ కంటెంట్ ని జోడించి తెర‌కెక్కిస్తున్న తాజా వెబ్ ఆంథాల‌జీ సినిమా `క‌మిట్మెంట్‌. ల‌వ్ .. డ్రీమ్.. హోప్.. ఫైట్ .. అంటూ ఆస‌క్తిక‌ర‌మైన ట్యాగ్ లైన్ ఇచ్చారు. తేజస్వి- రమ్య పసుపులేటి- సిమర్ సింగ్ త‌దిత‌రులు ప్ర‌ధాన‌ పాత్రల్లో నటించారు. ట్యాగ్ లైన్ కి త‌గ్గ‌ట్టే ఆ న‌లుగురు భామ‌ల ట్రీట్ పీక్స్ లో ఉండ‌నుంది. ఈ బోల్డ్ అండ్ స్పైసీ మూవీకి హైదరాబాద్ నవాబ్స్ ఫేమ్ లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం వహిస్తున్నారు. `గాంధీ బాత్` ఫేం.. వెబ్ సిరీస్ సంచలనం అన్వేషి జైన్ ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నారు. కమిట్మెంట్ ప్రీలుక్ ఇంత‌కుముందు వైర‌ల్ గా దూసుకెళ్లింది. తాజాగా తేజ‌స్వి ఫస్ట్ లుక్ ఆవిష్కరించారు.

తేజ‌స్వి హాట్ బికినీ లుక్ ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. టైటిల్ కి త‌గ్గట్టే తేజ‌స్వి స‌హా క‌థానాయిక‌లు హీటెక్కించే వీలుంది. ఇక నాలుగు ఎపిసోడ్స్ ని న‌లుగురు స్టార్ల‌పై తెర‌కెక్కించార‌ని స‌మాచారం. ఆ న‌లుగురు భామ‌ల క‌మిట్ మెంట్ ఏమిటి? స‌ద‌రు భామ‌ల జీవిత పోరాటం గమ్యం ఏమిట‌న్న‌దే ఈ సినిమా. ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం మ‌హ‌మ్మారీ క్రైసిస్ వ‌ల్ల ఆల‌స్య‌మైంది. వ‌ల్గారిటీని మించి కంటెంట్ ఉంటేనే జ‌నం ఆద‌రిస్తున్న ఈ రోజుల్లో ల‌క్ష్మీ కాంత్ చెన్నా ఎలాంటి సినిమాని అందిస్తున్నారో చూడాల‌న్న ఆస‌క్తి ఉంది.