ఘోరమైన ప్లాప్ టాక్ బాగా స్ప్రెడ్ అవ్వడంతో నాగార్జున ఈ సినిమాకు ఎన్ని చేసి న ఏమి పెట్టి లేపుదామని చూస్తున్నా ఎవ్వరు పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం నాగార్జున ఫ్యాన్స్ సంఘాలు, అక్కినేని అభిమానులు కూడా ఈ సినిమా ఆడుతున్న థియేటర్ల వైపు చూడడం లేదు.
తొలి ఆటకే డిజాస్టర్ టాక్ వచ్చేయడంతో, ఆ ప్రభావం వసూళ్లపై పడింది. ఈ సినిమా వసూళ్ళు షో… షోకు దారుణంగా పడిపోతున్నాయి. అటు శనివారం వచ్చిన బర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబు కొబ్బరిమట్ట రెండు రోజులకే బ్రేక్ ఈవెన్‌కు చేరుకుని లాభాల భాట పట్టేస్తే రూ.24 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన మన్మథుడు 2 మూడు రోజులకు వరల్డ్ వైడ్‌గా రూ.8 కోట్లు వసూలు చేసేందుకు ఆపసోపాలు పడింది.
మరికొన్ని చోట్ల సినిమాను లేపేసి కొబ్బరిమట్ట, రాక్షసుడు సినిమాలు వేస్తున్నారు. చివరికి ఆదివారం కూడా ఆక్యుపెన్సీ లేకపోవడం మన్మథుడు-2ను నీరుగార్చింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే ఇంకా రూ.16 కోట్లు రాబట్టాలి. ఓవరాల్‌గా ఈ సినిమాకు 50 శాతానికి పైగా నష్టాలు తప్పేలా లేవు. కోన్నవాడు మరి అడుక్కునే పరిస్థితి ఏర్పడింది. వాడికి ఏమైనా రికవరీ చేస్తారో లేదో తెలియాలి. వీరు మాత్రం కోట్లు కోట్లు దండుకున్నారు.
నైజాం – 2.10 కోట్లు
సీడెడ్ – 0.81 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.84 కోట్లు
ఈస్ట్ – 0.41 కోట్లు
వెస్ట్ – 0.43 కోట్లు
గుంటూరు – 0.80 కోట్లు
కృష్ణా – 0.52 కోట్లు
నెల్లూరు – 0.25 కోట్లు