ఆ హీరో చెమట కంపు భరించలేం…రకుల్ సంచలన వ్యాఖ్య

ర‌కుల్ ని అత‌డు నీడ‌లా వెంటాడేవాడ‌ట‌!

హీరో గారి చెమట కంపు భరించలేకపోయిందిట

సినిమావాళ్ళు నటులే. వాళ్లకీ చెమట వాసనలు , నోటి దుర్వాసనలు ఉంటూంటాయి. ఆ రోజుల్లో ఓ సీనియర్ నటుడు దుర్వాసన గురించి అంతా మాట్లాడేవారు. ఇప్పుడు ఓ హీరో చెమట వాసన గురించి రకుల్ కామెంట్ చేసింది. మంచు లక్ష్మి యాంకరింగ్ చేస్తున్న ఓ పోగ్రాంలో రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొంది. ఈ కార్యక్రమంలో రకుల్ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి కొన్ని విషయాలు పంచుకుంది.

ఓ సాంగ్ లో హీరోతో రొమాన్స్ చేస్తున్నప్పుడు అతని నుంచి వచ్చే చెమట కంపు తట్టుకోలేక పోయాను అని ఆమె చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు అని చెప్పింది రకుల్ . చివరికి ఆ హీరోకి చెప్పలేక… తానే ఫుల్లుగా పెర్ఫ్యూమ్ కొట్టుకున్నాను అని విషయం రివీల్ చేసింది.. అయితే రకుల్ ని చూసి సెట్ లో ఉన్న మిగతా వాళ్ళు కూడా అదే పని చేశారట. అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం చెప్పటానికి ఇష్టపడలేదు. ఇక ఈ విషయం నీకు కూడా గతంలో ఓసారి చెప్పానని రకుల్ అనడంతో మధ్యలో నన్ను లాగొద్దు అని సరదాగా రిక్వెస్ట్ చేసింది మంచు లక్ష్మి.

లక్ష్మి మంచు వ్యాఖ్యాతగా ‘వూట్’ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రసారమైన ‘ఫీటప్ విత్ స్టార్స్’ కార్యక్రమంలో పాల్గొంది రకుల్‌ప్రీత్ సింగ్. ఇందులో లక్ష్మి మంచుతో తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించి పలు విషయాలను పంచుకుంది.