మంచు మనోజ్ సినిమాల సంగతి ప్రక్కన పెడితే సామాజిక సమస్యల పట్ల వెంటనే స్పందిస్తూంటారు. తాజాగా ఆయన ప్రణయ్, అమృతల ప్రేమ గురించి, ప్రణయ్ హత్య గురించి సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. అయితే ఆ పోస్ట్ ని సమర్దించేవాళ్లతో పాటు విమర్శించే వాళ్లు ఎక్కువయ్యారు. దాంతో ఆయనకు మండుకొచ్చింది. వెంటనే ఓ వీడియో వదిలారు యూట్యూబ్ లో .
ఆ వీడియోలో… ప్రణయ్ హత్య విషయంలో అంతా కూడా అయ్యో పాపం అనాల్సింది పోయి కొందరు నీచంగా చంపడంను సమర్థిస్తున్నారు. స్టేటస్ కోసం చంపడం కెరెక్ట్ అంటున్నారు. 10వ తరగతి చదివే పిల్లలకు కులం గురించి ఏం తెలుస్తుందండి – ఆ వయస్సులో ప్రేమ చాలా స్వచ్చమైనది. ఈ విషయమై కొందరు ఫేస్ బుక్ – ట్విట్టర్ లో చేస్తున్న వ్యాఖ్యలకు ఇలాంటి నీచులు ఉన్న సమాజంలో నేను ఉన్నందుకు సిగ్గు పడుతున్నాను. పరువు హత్యను సమర్ధించే ప్రతి ఒక్క కుక్కని చెప్పుతో కొట్టాలన్నారు. సోషల్ మీడియాలో అలాంటి రాతలు రాసేవాళ్లు పేర్లు పోలీస్ లు రికార్డ్ చేసుకోవాలని అన్నారు.
ఆ వీడియో పెట్టిన దగ్గర నుంచి మంచు మనోజ్ వ్యతిరేకంగా విపరీతమైన కామెంట్స్, ట్రోల్స్ వస్తున్నాయి. ఆ కామెంట్స్ చాలా దారుణంగా ఉన్నాయి. మరి మనోజ్ ఆ కామెంట్స్ పెట్టిన వారిపై ఏం చర్యతీసుకుంటారో అని చాలా మంది అంటున్నారు. పదవ తరగతి చదివే పిల్లలకు కులం గురించి ఏం తెలుస్తుంది ప్రేమ గురించి తప్పే అన్న విషయం చాలా మంది నవ్వుకుంటున్నారు.