ఆ హీరోకు సపోర్ట్ చేస్తావా? మండిపడ్డ……రకుల్, తాప్సీ

మహిళలు…మీటూ అంటూ ఓ ఉద్యమ స్పూర్తితో ముందుకు వెళ్తున్న సమయం ఇది. ఈ సమయంలో ఏ ఒక్క చిన్న పొరపాటును కూడా సహించేలాగ లేరు. అందుకు ఉదాహరణ..రీసెంట్ గా ఓ మహిళా పాత్రికేయురాలిపై మంచు లక్ష్మి, రకుల్, తాప్సీ మండిపడటమే.

అసలేం జరిగింటే…

మ‌ల‌యాళ  హీరో  దిలీప్  ఆ మధ్యన  ఓ న‌టిని లైంగికంగా వేధించాడ‌ని బాధిత మ‌హిళ కేసు పెట్ట‌డంతో ఆయ‌న‌ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల బెయిల్‌పై బ‌య‌ట‌కి వ‌చ్చాడు. అయితే దిలీప్‌, కావ్య దంప‌తుల‌కి రీసెంట్‌గా ఆడ‌పిల్ల జ‌న్మించింది ఈక్ర‌మంలో ‘లవ్లీ కపుల్ దిలీప్‌, కావ్యకు ఆడశిశువు జన్మించింది.. శుభాకాంక్షలు’ అని ట్వీట్‌ చేశారు చెన్నైకు చెందిన ఓ పముఖ మ‌హిళా పాత్రికేయురాలు.

ఈ ట్వీట్ పై మండిప‌డ్డ మంచు ల‌క్ష్మీ న‌టి అప‌హ‌ర‌ణ‌, లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న దిలీప్ కుమార్‌ని ట్యాగ్ చేయ‌డం న‌మ్మ‌లేక‌పోతున్నా. న‌టీమ‌ణులు అంద‌రు ఆయ‌న‌కి వ్య‌తిరేఖంగా పోరాడుతున్న స‌మ‌యంలో నువ్వు ఆయ‌న‌కి స‌పోర్ట్‌గా ఉండ‌డం సిగ్గు ప‌డాల్సిన విష‌యం అని ఫైర్ అయ్యారు.

 తాప్సీ స్పందిస్తూ….ఓ మ‌హిళే మీటూ ఉద్య‌మానికి వ్య‌తిరేఖంగా ప్ర‌వ‌ర్తిసుంటే చాలా ఇబ్బందిక‌రంగా ఉంద‌ని అన్నారు. ఇక రకుల్ అయితే…దిలీప్
లాంటి వ్య‌క్తుల గురించి మీడియా గొప్ప‌గా చెప్ప‌డం విడ్డూరంగా ఉంది. మీ నుండి ఇలాంటి ట్వీట్ వ‌చ్చిందంటే న‌మ్మాలనిపించ‌డం లేదు. మార్పు మ‌న నుండే వ‌చ్చింద‌ని గుర్తు పెట్టుకోండ‌ని ర‌కుల్  తెలిపారు.