సూపర్ స్టార్ మహేష్ బాబుకు అభిమానుల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ లేడీ అభిమానులు మహేష్ ని పిచ్చిగా లైక్ చేస్తారు. మహేష్ కి అమ్మాయిల నుంచి ఎన్నో ప్రపోజల్స్ రోజూ వస్తూనే ఉంటాయి. చిన్న స్థాయి హీరోయిన్లు, స్టార్ హీరోయిన్లు కూడా మహేష్ ను లైక్ చేస్తుంటారు. చాలా సందర్భల్లో హీరోయిన్లు బాహాటంగానే మహేష్ ని మిస్ అయ్యానే అన్న భావనని బయటపెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. బాలీవుడ్ హీరోయిన్లు మహేష్ ని అంతే అభిమానిస్తారు. ఓ సందర్భంలో దీపికా పదుకొణే కూడా మహేష్ తో ఒక్క సినిమా అయినా చేయాలని అంది. అంటే మహేష్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
అలాగే బాలీవుడ్ హీరోయిన్ మీరా చోప్రా ని సోషల్ మీడియా వేదికగా కొంత మంది ఫాన్స్ మీరు టాలీవుడ్ లో ఏ హీరో అభిమాని అని అడిగితే, సూపర్ స్టార్ మహేష్ అని..అతనితో సినిమా చేయాలని ఉందని తెలిపింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు మా హీరో కి అభిమానివి కాదా అంటూ ప్రశ్నించారు. దానికి అమ్మడు చెప్పానుగా నేను సూపర్ స్టార్ అభిమానిని అని బధులిచ్చింది. దీంతో రెచ్చిపోయిన ఎన్టీఆర్ అభిమానులు మీరా చోప్రాని పై దాడికి దీగారు. సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. దీంతో మీరా చోప్రా ఎన్టీఆర్ వెంటనే స్పందించాలని ఓ పోస్ట్ పెట్టింది.
ఇలాంటి వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరింది. అమ్మడిని దూషించిన కొన్ని కామెంట్లను పోస్ట్ చేసింది. దీంతో మీరా చోప్రాకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఈ విషయంలో మీరా చోప్రా తప్పు మాట్లాడటం గానీ, అభిమానులు తిట్టడం గానీ ఎక్కడా చేయలేదు. ఈ విషయంలో ఎన్టీఆర్ అభిమానులు అత్యుత్సాహం చూపించి రెచ్చిపోయారు. ఇటు నుంచి మహేష్ అభిమానుల నుంచి సపోర్ట్ దొరికింది. మరి ఈ వ్యవహారంలో పోలీసులు స్పందిస్తారా? లేదా? ఎన్టీఆర్ ఏమంటారు? అన్నది చూడాలి. ఎప్పుడూ అభిమానులు బాగు కోరుకునే ఎన్టీఆర్ కు ఇది ఓ అపవాదు లాంటింది.