వైరల్ వీడియో: ‘బాహుబలి’ సాంగ్ కు మహేష్ కూతురు డాన్స్

మహేష్ బాబు ముద్దుల కూతురు సితారకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. తన బుజ్జి బుజ్జి డాన్స్ లతో,మాటలతో పాటలతో, గారాలతో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటుంది. దానికి తోడు తల్లి, తండ్రి ఇద్దరూ కూడా నటులు కావటం, తాతగారు కూడా సూపర్ స్టార్ కావటంతో ఆమె జీన్స్ లోనే నటన అనేది ఉన్నట్లుంది. ఆ విషయం మనకు ఈ వీడియో చూస్తే అర్దమవుతుంది. తన డాన్స్‌తో అదరగొట్టిన ఈ వీడియో ఇప్పుడు అంతటా వైరల్ అవుతోంది.

తమ ఇంట్లోని జిమ్‌లో బాహుబలి-2 ద కన్‌క్లూజన్‌ సినిమాలోని ‘కన్నా నిదురించరా.. నా కన్నా నిదురించరా..’ పాటకు స్టెప్పులేసి ఆకట్టుకుంది. తన గారాలపట్టి చిన్ని చిన్ని స్టెప్పులకు మురిసిపోయిన మహేష్‌ ఈ డాన్స్‌కు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్టు చేస్తూ.. ‘వాట్‌ ఎ టాలెంట్‌’ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు.

నిజమే కదా… చిన్న వయస్సులోనే ఇలా చక్కని స్టెప్పులతో డాన్స్ వేయడం సూపర్ కదా..ఈ విషయం చెప్తూ.. మహేష్ బాబు ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తూన్నారు. సితార గతంలో కూడా తన స్టెప్పులతో అందరిని ఆకర్షించిన విషయం తెల్సిందే.

ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే… వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌ 25వ సినిమా ‘మహర్షి’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దిల్‌రాజు, అశ్వనీదత్‌, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటిస్తుండగా.. పూజా హేగ్డే హీరోయిన్‌గా అలరించనుంది.