తెలుసా : మహేష్ బాబే ..అప్పట్లో కౌశల్ చేత

బిగ్ బాస్ సీజ‌న్ 2లో కంటెస్టెంట్‌గా వ‌చ్చిన కౌశల్  త‌న బిహేవియర్ తో అంద‌రి మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే. అదే స్దాయికి వెళ్లింది అంటే  బిగ్ బాస్ అంటే కౌశ‌ల్‌, కౌశ‌ల్ అంటే బిగ్ బాస్ అన్నట్లు తయారైంది.  మరో ప్రక్క కౌశ‌ల్ ఆర్మీ అనే గ్రూప్ ఫాం అయ్యి, ర్యాలీలు, 2 కే ర‌న్ లు చేప‌ట్ట‌డం కూడా జరిగింది. అందరూ ఊహించినట్లుగానే కౌశల్… విజేతగా నిలిచారు. తదనంతరం మీడియాతో మాట్లాడుతూ… మ‌హేష్ బాబు లేకుంటే తాను లేన‌నే విష‌యం చెప్పారు.

రాజకుమారుడు సినిమా స‌మ‌యంలో త‌మ మ‌ధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింద‌ని, హైద‌రాబాద్‌లో ద‌గ్గ‌రుండి నా చేత మోడలింగ్ ఏజెన్సీ ఏర్పాటు చేయించారని, మ‌హేష్ గురించి  కౌశ‌ల్ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేకాదు బిగ్ బాస్‌కి రావ‌డానికి కార‌ణం కూడా మ‌హేష్ అని కౌశ‌ల్ స్ప‌ష్టం చేశారు.

ఈ నేఫద్యంలో .. మ‌హేష్ బాబు బిగ్ బాస్ 2 టైటిల్ గెలుచుకున్నందుకు కౌశ‌ల్‌కి కంగ్రాట్స్ తెలిపాడు. ఇది చాలా పెద్ద విజ‌యం. ఇది నీకుచాలా ఆనందాన్నిస్తుంది. ఈ స‌క్సెస్‌ని బాగా ఎంజాయ్ చేయి అంటూ ట్వీట్ ద్వారా తెలిపారు మ‌హేష్‌.ఈ ట్వీట్ వైరల్ అయ్యింది.

 

మరో ప్రక్క కౌశ‌ల్‌కి ఉన్న క్రేజ్‌ని మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు క్యాష్ చేసుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శీను
ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య‌తో క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. ఇందులో కౌశ‌ల్‌ని విల‌న్‌గా కాని లేదంటే కీల‌క పాత్ర కోసం ఎంపిక చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌.