మహేష్ కొత్త బిజినెస్ గురించి వింటే పండగ చేసుకుంటారు

మహేష్ సినిమాలు..మహేష్ సొంత థియోటర్స్ లో చూడచ్చు… అవును..మీరు విన్నది నిజమే ..సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు  మల్టిప్లెక్స్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు. ఆయన సినిమాలను మీరు ఇంచక్కా ఆయన నిర్మించిన థియోటర్స్  లో చూడవచ్చు. సినిమాలు, యాడ్స్ అంటూ దూసుకుపోతున్న మహేష్ బాబు… లీడింగ్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అయిన ఆసియన్ సినిమాస్ సునీల్ నారంగ్ తో కలిసి మహేష్ బాబు
రెండు తెలుగు రాష్ట్రాల్లో మల్టిప్లెక్స్ చైన్ నెలకొల్పే ప్రయత్నాలు చేస్తున్నారు.

 హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏరియాలో సునీల్-మహేష్ బాబు కు సంబంధించిన ఒక భారీ మల్టిప్లెక్స్ ఆల్రెడీ నిర్మాణంలో ఉండటం ఆ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.  ఇక ఈ మల్టిప్లెక్స్ గ్రూప్ పేరు ‘AMB సినిమాస్’.  అంటే ఏషియన్ ఫిల్మ్స్ , మహేష్ బాబు  రెండు కలిసి వచ్చేలా పేరు పెట్టారన్నమాట.

ఈ మల్టిప్లెక్స్ వచ్చే ఏడాది ఓపెన్  అవుతుందని సమాచారం. గచ్చిబౌలి నుండి కొత్తగూడ క్రాస్ రోడ్ కు వచ్చేదారిలో మెయిన్ రోడ్ మీద నిర్మాణం జరుపుకుంటున్న ఒక భారీ మాల్ లో ఈ మల్టిప్లెక్స్ ఉంది.

ఈ మల్టిప్లెక్స్ కూడా మహేష్ బాబు సినిమాలాగే కొత్తగా, ఇంట్రస్టింగ్ గా అందంగా మాడరన్ ఫెసిలిటీస్ తో రెడీ అవుతోంది. ఇక ఈ మల్టిప్లెక్స్ కు సంబంధించిన స్కెచ్ లు ఈరోజే బయటకు వచ్చాయి.  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ గ్రూప్ ను విస్తరించే ప్లాన్స్ లో ఉన్నారట.  ఈ బిజినెస్ లో మహేష్ బాబు భారీగా పెడుతున్నాడని టాక్.