మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కు ఈ ఏడాది ఈ మాత్రం అచ్చోచ్చినట్టు లేదు. డ్రగ్స్, కాస్టింగ్ కౌచ్ ఉందంతాలు ‘మా’ పరువును బజారుకు లాగగా … తాజాగా నిధుల దుర్వినియోగం గొడవ ‘మా’ను సిగ్గుతో తలొంచుకునేలా చేసింది. అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా నిధులను దుర్వినియోగం చేసారంటూ ఓ ఆంగ్ల పత్రికలో కధనం ప్రచురిమవడంతో వివాదం తలెత్తింది. సంఘం కార్యదర్శి నరేష్ ఆ కథనానికి మద్దతు పలికారు. దీంతో, అసోసియేషన్ రెండుగా చీలిపోయి ఆరోపణలు , ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి.
ఈ వివాదం లో తన పేరు ప్రస్తావనకు రావడంతో మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేసారని సమాచారం. మరోవైపు అక్టోబర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ ఈవెంట్ ను ‘మా’ సభ్యులు ఫిక్స్ చేసారు. అయితే , వివాదం నేపథ్యంలో ఈవెంట్ ను మహేష్ బాబు క్యాన్సిల్ చేసుకున్నట్టు ఫిలింనగర్ టాక్. ఇలాంటి సమయంలో తాను ఈ షోలో పాల్గొనడం మంచిది కాదనే భావనలో మహేష్ బాబు ఉన్నాడట. యూ.ఎస్ లో అంత ఫాలోయింగ్ ఉన్న మహేష్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసుకోవడం… ‘మా’కు పెద్ద షాకే.