తెలుగు సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు ఇప్పుడు సర్వ సాధారణంగా మారిపోయాయి. సీన్ డిమాండ్ చేస్తే పెదవి ముద్దులు… అవసరం మేర బెడ్ రూమ్ సన్నివేశాలు…అంతకు మించి సీన్ ఇంకా డిమాండ్ చేస్తే న్యూడ్ సన్నివేశాలకు తెలుగు సినిమా ఎప్పుడో ఎదిగిపోయింది. హాలీవుడ్ నుంచి బాలీవుడ్..వాళ్ల నుంచి టాలీవుడ్ ఇలా ఒకర్ని చూసి ఒకరు భారతీయ సంస్కతిని ..సంప్రదాయాల్ని గంగలో కలిపేసారు. డిమాండ్ ఉన్నంత కాలం పిండుకోవడమే ఇప్పుడున్న కాన్సెప్ట్. సినిమాకి రొమాన్స్ అందమే..కానీ ఆ రొమాన్స్ హద్దు మీర కూడదు! అన్న నిబంధన ఎక్కడ ఉంది. ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరు పాటిస్తున్నారు. అప్పుడప్పుడు కొంత మంది తెలుగు స్టార్ హీరోలు ఆ రకంగా ముందుకెళ్తున్నారు అని వినిపిస్తు న్నా..కొన్నికొన్ని సార్లు వాళ్లు హద్దు మీరుతున్న సంగతి తెలిసిందే.
సీన్ డిమాండ్ చేస్తే తప్పడం లేదంటూ మింగిలైపోతున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్లు అల్లు అర్జున్ మరోసారి ఘాటైన సన్నివేశాల్లో నటించడానికి రెడీ అవుతున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో జోరుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా షూటింగ్ కు ప్రారంభించలేదు. వైరస్ తగ్గుముఖం పట్టగానే వెంటనే బన్నీ-సుకుమార్ సెట్స్ కు వెళ్లడానికి రెడీ అవుతున్నారు. శేషా చలం అడవి సెట్లను హైదరాబాద్ లో రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నుంచి ఓ ఆసక్తికర విషయం లీకైంది. ఇందులో బన్నీ-హీరోయిన్ రష్మిక మందనతో ఘాటైన లిప్ లాక్ సన్నివేశంలో నటిస్తున్నాడుట.
ఓ సన్నివేశం డిమాండ్ మేరకు స్ర్కిప్ట్ లో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయని తెలిసింది. అవన్నీ ఫారెస్ట్ నేపథ్యంలో…అక్కడే నైట్ మోడ్ లో చిత్రీకరించే సన్నివేశాలని అంటున్నారు. ఇక ఇలాంటి సన్నివేశాలు రక్తి కట్టించడంలో సుకుమార్ ట్యాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. `జగడం`, `ఆర్య` లాంటి సినిమాల్లో సుకుమార్ రొమాంటిక్ సన్నివేశాల్ని ఏ స్థాయిలో పండించాడో తెలిసిందే. రష్మిక పెదవి ముద్దుల్లో చిచ్చర పిడుగులా చెలరేగిపోతుంది! అని చెప్పాలా? `గీతగోవిందం`, `డియర్ కామ్రేడ్` లో అమ్మడు ఏస్థాయిలో పండించిందో తెలిసిందే.