ఓటిటి లో లావణ్య త్రిపాఠి ప్లాప్ ట్రీట్ కి రిలీజ్ డేట్ వచ్చేసింది.!

ఈ ఏడాది టాలీవుడ్ ఎంత పెద్ద భారీ హిట్స్ ని చూసిందో అంతే స్థాయిలో భారీ డౌన్ ని కూడా ఈ సినిమా చూసింది. ముఖ్యంగా గత జూలై నెలలో అయితే అసలు ఊహించని రేంజ్ లో అన్ని సినిమాలు వరుస ప్లాప్ లు అవుతూ రావడం ఒకింత ఆందోళనగా మారి సినిమాలు షూటింగ్స్ స్వచ్చందంగా ఆపేసుకున్న పరిస్థితి నెలకొంది.

ఇక ఈ సినిమాల్లో అయితే మంచి అంచనాలు తోనే అది కూడా లావణ్య త్రిపాఠి మెయిన్ లీడ్ లో నటించిన చిత్రం “హ్యాపీ బర్త్ డే” కూడా వచ్చింది. దీనికి దర్శకుడు మత్తు వదలరా ఫేమ్ రితేష్ రానా తెరకెక్కించడం ట్రైలర్, ప్రమోషన్ లు మంచి క్రేజీ గా ఉండడంతో ఆడియెన్స్ కూడా ఆసక్తి కనబరిచారు.

కానీ తీరా థియేటర్స్ లో సినిమా వచ్చాక అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. దీనితో ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమాలో కామెడీ మాత్రం బాగుంది అని అంతా అన్నారు. ఇక ఫైనల్ గా అయితే ఇప్పుడు ఈ ట్రీట్ ఓటిటి లో వచ్చేస్తున్నట్టుగా వార్తలు కన్ఫర్మ్ అయ్యింది.

వీటి ప్రకారం అయితే ఈ సినిమా హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఇందులో ఈ చిత్రం ఈ ఆగష్టు 8 నుంచి స్ట్రీమింగ్ కి రాబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి అప్పుడు ఈ క్రేజీ కామెడీ చూడని వారు చూడచ్చని మేకర్స్ అంటున్నారు. ఇక ఈ చిత్రంలో కమెడియన్ సత్య, వెన్నెల కిషోర్ లు కీలక పాత్రల్లో నటించగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే.