వకీల్ సాబ్ టీజర్.. ఫ్యాన్స్ కు ఆ రోజు పండగే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యదిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పాలిటిక్స్ లో బిజీగా ఉంటూనే కష్టపడి వకీల్ సాబ్ షూటింగ్ కోసం టైమ్ కేటాయించిన పవన్ తుది దశకు తెచ్చే లోపే కరోనా దెబ్బ కొట్టింది. దాదాపు సినిమా పనులన్నీ పూర్తయ్యాయి. ఇక థియేటర్స్ తెరిస్తే హడావుడి మొదలు కావాల్సిందే. కానీ దిల్ రాజు మాత్రం రిస్క్ తీసుకోవడం లేదు.
vakeel saab
సినిమాకు సంబంధించిన టీజర్ కూడా ఇంకా రిలీజ్ కాలేదు. అయితే ట్విట్టర్ లో వకీల్ సాబ్ హ్యాష్ ట్యాగ్ మాత్రం బాగానే ట్రెండ్ అయ్యింది. ఈ ఏడాది ఎక్కువగా ట్రెండ్ అయిన సౌత్ సినిమాలలో వకీల్ సాబ్ హ్యాష్ టాగ్ రెండో స్థానంలో నిలిచింది. విజయ్ మాస్టర్ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. మాస్టర్ అంటే అప్పటికే టీజర్ రిలీజ్ అయ్యింది. కానీ వకీల్ సాబ్ కు సంబంధించిన ఒక్క టీజర్ క్లిప్ కూడా రాలేదు.

ఒక్క సాంగ్ పోస్టర్స్ మాత్రమే వచ్చాయి. అయితే ఈ హడావుడిలోనే టీజర్ ను రిలీజ్ చేస్తే బావుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. న్యూ ఇయర్ కు రిలీజ్ చేస్తే ఈ ట్రెండ్ ను అలానే కంటిన్యూ చేసినట్టు కూడా ఉంటుంది. పైగా మంచి ప్రమోషన్ కూడా. దిల్ రాజు ఇప్పటికే ఈ విషయంపై చర్చలు జరిపినట్లు సమాచారం. టీజర్ కాకపోయినా న్యూ ఇయర్ హడావుడిలో వకీల్ సాబ్ హవా ఉండేలా ఏదైనా ప్లాన్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. మరి ఆ ప్లాన్ అభిమానులకు ఎంత వరకు కిక్కిస్తుందో చూడాలి.