ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ గా రూపొందుతున్న RRRపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోలు కలిసి నటిస్తుండమే ఒక ఎత్తు అయితే.. వారిద్దరు స్వాతంత్ర సమరయోధులుగా కనిపించడం మరొక ఎత్తు. చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. తారక్ కొమురం భీమ్ గా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో అని అభిమానం లోకం ఎంతగానో ఎదురుచూస్తోంది. అయితే సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ హాట్ టాపిక్ గా మారుతోంది.
సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గా ఎలా ఉండబోతున్నాడో టీజర్ తోనే అర్థమయ్యింది. ఇక ఇదొక ఫిక్షనల్ సినిమా అంటూ ముందే క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు. ఇక సినిమాలో కొమురం భీమ్ పాత్రలో తారక్ పెర్ఫెమెన్స్ తో పాటు ఆ పాత్రతోనే వివిధ రకాల గెటప్స్ లలో అలరించనున్నాడట. వృద్ధుడి పాత్రలో కూడా తారక్ తన టాలెంట్ ను బయటపెట్టనున్నట్లు తెలుస్తోంది. నిజాం నవాబులను బురిడీ కొట్టించడానికి మారువేశాల్లో కొమురం భీమ్ తిరిగినట్లు వచ్చిన ఊహాగానాలకు రాజమౌళి తనదైన శైలిలో ప్రాణం పోస్తున్నాడు.
అందులో భాగంగానే ముస్లిమ్ గెటప్ లో కూడా కనిపిస్తాడని ఫస్ట్ లుక్ టీజర్ లో చూపించారు. RRRలో రామ్ చరణ్ కు సంబంధించిన సీన్స్ పై ఇప్పటివరకు పెద్దగా రూమర్స్ రాలేవు. కానీ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన లీక్స్ మాత్రం బాగానే వైరల్ అవుతున్నాయి. అయితే రెండు పాత్రలను కూడా సమానంగా హైలెట్ చేసి చూపిస్తామని జక్కన్న మాత్రం అభిమానులకు మాట ఇచ్చాడు. రామ్ చరణ్ కు సంబంధించిన సీన్స్ కూడా సినిమాలో చాలా పవర్ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ టీజర్ ను న్యూ ఇయర్ కానుకగా విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.