“ఆదిపురుష్” పై లేటెస్ట్ అప్డేట్..ఓ కొత్త టెస్ట్ ట్రై చేస్తున్నారట.!

యంగ్ రెబల్ స్టార్ ని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టిన భారీ చిత్రం బాహుబలి తర్వాత మళ్ళీ తాను వెనక్కి తిరిగి చూసుకోలేదు. అక్కడ నుంచి తాను ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా సినిమానే అవుతుంది. మరి ఈ చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ప్రభాస్ ని ఎంతో నమ్మి దాదాపు 500 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమానే “ఆదిపురుష్”.

ఆల్రెడీ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగా పోస్ట్ ప్రొడక్షన్ గ్రాఫిక్స్ వర్క్ లో చిత్ర యూనిట్ ఉన్నారు. అయితే ఈ సినిమా ని చాలా సీక్రెట్ గానే పనులు కనిచేస్తున్నా తాజాగా ఓ కీలక టెస్ట్ ఏదో సినిమాకి ట్రై చేస్తున్న వార్తలు ఇప్పుడు బయటకి వస్తున్నాయి.

ఒక మినీ థియేటర్ లాంటిది పెట్టి అందులో ఆదిపురుష్ కి ఒక కొత్త ప్రయత్నం చేస్తుండగా దానినే ప్రస్తుతం చిత్ర యూనిట్ టెస్ట్ చేస్తున్నట్టుగా ఈ సినిమా యూనిట్ సభ్యులు శ్రద్దా శ్రీకాంత్ తెలియజేసారు. దీనితో ఇప్పుడు ఈ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరామునిగా నటిస్తుండగా కృతి సనన్ జానకి దేవీగా నటించింది. అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణ్ పాత్రలో నటించాడు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ కాబోతుంది.