ఇండస్ట్రీ టాక్ : మహేష్, త్రివిక్రమ్ భారీ సినిమా లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం..!

టాలీవుడ్ లో ఉన్నటువంటి కొన్ని క్రేజీ కాంబినేషన్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లా కాంబినేషన్ కూడా ఒకటి. అయితే ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు కూడా ఒకదాన్ని మించి ఒకటి క్లాసిక్ అయ్యాయి.

అయితే బాక్సాఫీస్ దగ్గర అంత బాగా రాణించకపోయినా తర్వాత తర్వాతకి అవి పెద్ద హిట్స్ అయ్యాయి. అందుకే వీరి నుంచి మూడో సినిమా అనౌన్స్ చేయగానే భారీ స్థాయి అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది అని ఎదురు చూస్తుండగా ఇప్పుడు దీనిపై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇండస్ట్రీ నుంచి బయటకి వచ్చాయి.

ఈ చిత్రం షూటింగ్ నిజానికి ఈ ఆగస్ట్ 15 నుంచి స్టార్ట్ కావాల్సి ఉంది. కానీ ఈ చిత్రం అనుకోని విధంగా వాయిదా పడాల్సి వచ్చింది. అందుకే ఈ చిత్రం ఈ ఆగస్ట్ 21 నుంచి స్టార్ట్ అవ్వబోతున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఇక మరో ఇంట్రెస్టింగ్ సమాచారం ఏమిటంటే ఈ చిత్రాన్ని భారీ ఏక్షన్ థ్రిల్లర్ గా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తుండగా..

మహేష్ బాబు పాత్రని త్రివిక్రమ్ చాలా కొత్తగా ఇది వరకు ఎప్పుడు చూడని రకంగా డిజైన్ చేసినట్టుగా సీన్ వర్గాల నుంచి మరో సమాచారం. మొత్తానికి అయితే ఈ సినిమాపై ఈ అప్డేట్స్ తెలుస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే భారీ బడ్జెట్ తో హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.