వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ”లక్ష్మీస్ ఎన్టీఆర్” పేరిట ఎన్టీఆర్ చరమాంక జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన దగ్గర నుంచి నడిచిన కథను రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ నెల 22న విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పటికే రకరకలా పిర్యాదులు,కేసులు పడ్డాయి. సినిమా రిలీజ్ ఆగిపోయే అవకాసం ఉందంటూ మీడియాలో వార్తలువస్తున్నాయి. ఈ నేపధ్యంలో రామ్ గోపాల్ వర్మ స్పెషల్ ప్రీమియర్ షో ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
అందుతున్న సమాచారం మేరకు ..మీడియా వారికి, కొంతమంది సినీ ప్రముఖులకు..రిలీజ్ కు ఓ వారం ముందుగా ఓ స్పెషల్ ప్రీమియర్ షో వేసి చూపాలని ఆయన ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు వర్మ ఏర్పాట్లు చెస్తున్నట్లు వినపడుతోంది. అంటే వారం ముందుగానే సినిమా గురించి టాక్ బయిటకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తే అదే ఓపినింగ్స్ రప్పిస్తుందని అనుకుంటున్నారు. అప్పుడు తెలుగుదేశం వాళ్లు ఎలాగో విషయం బయిట వెళ్లిపోయింది కదా అని.. సినిమా ఆపేయాలనే ఆలోచన మానుకుంటారు అని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
ఇక రీసెంట్ గా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విడుదలను నిలిపివేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఈ మేరకు తెదేపా కార్యకర్త దేవీబాబు చౌదరి ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికలపై ప్రభావం చూపేలా ఈ చిత్రం ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ఆపాలని కోరారు.
సినిమాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రను నెగెటివ్‌గా చూపించారని, ఓటర్లపై ఈ సినిమా ప్రభావం చూపుతుందని అభ్యంతరం తెలిపారు. తొలి విడత పోలింగ్ పూర్తయ్యే వరకు సినిమా విడుదల నిలివేయాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదు కాపీని స్వీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు .. పరిశీలన కోసం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపారు.