ఎన్నో వివాదాలు.. అంతకు రెట్టింపు అంచనాల మధ్య ఈ రోజు ప్రపంచ ప్రేక్షకులు (ఆంధ్రా మినహా) ముందుకు వచ్చింది ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ నేపధ్యంలో ఇప్పటికే కొన్ని దేశాల్లో సినిమా షోలు పూర్తాయ్యాయి. అక్కడ నుంచి అందుతున్న సమాచారం క్రోడీకరించుకుని ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ అందిస్తున్నాం.
బాలయ్యకు స్పెషల్ ధాంక్స్ అంటూ మొదలైన ఈ సినిమా పూర్తిగా ఒకే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లింది. అదే చంద్రబాబు వెన్ను పోటు ఎపిసోడ్. దాదాపు అందరికీ తెలిసిన విషయాన్నే డ్రమటైజ్ చేస్తూ వర్మ ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే లక్ష్మీ పార్వతి రాసిన పుస్తకం ఆధారంగా తీసిన చిత్రం వల్లనేమో కానీ సినిమా మొత్తం ఆమెకు ఫేవెర్ గా చంద్రబాబుని నెగిటివ్ గా చూపిస్తూ సాగుతుంది.
ఇక ఈ సినిమాని ప్రేక్షకుల మాట అటుంచితే.. ప్రధాన పార్టీలైన రెండు వర్గాల వారు కాన్సర్టేట్ చేసి మరీ చూసి తమ అభిప్రాయాలు చెవ్తున్నారు. అయితే అవి కూడా వాళ్ల పాయింటాఫ్ వ్యూలోనే తమ మనస్సులో ఏ పార్టిని బలపరుస్తారో అందుకు తగ్గట్లే స్పందిస్తున్నారు. ఈ సినిమాని సినిమాగా చూడటానికి ఇష్టపడుతున్నట్లు అనిపించటం లేదు. దాంతో సోషల్ మీడియాలో ఈ సినిమాకు మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
సినిమా ఫస్ట్ హాఫ్ లో లక్ష్మీపార్వతి ని హైలెట్ చేస్తూ..ఆవిడ చాలా అమాయకురాలని, ఓ అభిమానిగా ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించిందని..అంతకు మించి ఆమెకు వేరే ఆలోచన లేదన్నట్లుగా తెరకెక్కించారు. దాంతో ఎన్టీఆర్-లక్ష్మీ పార్వతి మధ్య వచ్చే సన్నివేశాలు తప్ప ఫస్టాఫ్‌లో వేరే ఏమీ చేటు చేసుకోలేదట. అవి మొదట ఇంట్రస్టింగ్ గా ఉన్నా..అవే కంటిన్యూగా రావటం, పెద్దగా చెప్పుకోదగ్గ మలుపులు ఏమీ రాకపోవటంతో .. బోర్ కొట్టిందంటున్నారు.
ఇక చంద్రబాబు ఎంట్రీ చాలా సాదా సీదాగా ఉందని, ఆ సన్నివేశాలు ఆకట్టుకోలేదని కొందరు చెప్తున్నారు. అయితే చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతను వర్మ …ఈ సినిమాలో ఏ మొహమాటం లేకుండా పూర్తిగా బయటపెట్టేశారని చెబుతున్నారు. మొత్తంగా రాజకీయాల మీద ఇంట్రస్ట్ ఉన్నవాళ్లకు తప్ప వేరే వాళ్లకు అంత రుచించని వంటకమే అని తేలుస్తున్నారు.
అదే సమయంలో ఇటువంటి సినిమాను తీయటం , ఇంత ధైర్యంగా ఓ ముఖ్యమంత్రిని నెగిటివ్ గా చూపించటం కేవలం వర్మ వల్లే అవుతుందని, వేరే ఏ ఫిల్మ్ మేకర్ కు ఆ ధైర్య లేదని ఆయన్ను అభినందించకుండా ఉండలేమని ప్రశంసిస్తున్నారు.
ఒకరిద్దరు అయితే ఎన్టీఆర్-లక్ష్మీపార్వతి మధ్య నడిచిన ఓల్డేజ్ లవ్ స్టోరీని ఆకట్టుకునేలా చూపించారని మెచ్చుకుంటున్నారు. అన్నిటికన్నా హైలెట్ ఈ సినిమాకు కల్యాణ్ మాలిక్ అందించిన సంగీతం అని కొనియాడుతున్నారు. లక్ష్మీపార్వతి పాత్రలో యజ్ఞాశెట్టి సూపర్ గా సెట్ అయ్యిందని చెబుతున్నారు. ఎన్టీఆర్ పాత్రలో పి.విజయ్ కుమార్ పరకాయ ప్రవేశం చేసాడని, ఆయన అద్దినట్టు సరిపోయాడని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ..సినిమా ఓ వర్గాన్ని బాగా ఆకట్టుకుంటోంది. వర్మ గత చిత్రాల్లా చూడలేనంత నీరసంగా , బోర్ గా అయితే లేదు.