రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు ఘట్టాన్ని ప్రధానాంశంగా తీసుకుని తీసిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. కాగా ఈ నెల 29న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ రెడీ అయింది. ఈ సినిమాను విడుదల చేయద్దంటూ ఇద్దరు వ్యక్తులు వేసిన రిట్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో గురువారం వాదనలు జరిగాయి. అయితే ఈ చిత్రం విడుదల ఆపాలని ఊహించని విధంగా ఏపీ హైకోర్టు స్టే విధించింది.
దాంతో ఈ చిత్రం ఈ రోజు ఆంధ్రాలో విడుదల కావడం లేదు. ఏప్రిల్ 3వ తేదీ వరకు ఈ సినిమాను ప్రదర్శించవద్దని హైకోర్టు చిత్ర యూనిట్ ని ఆదేశించింది. ఏపీలో జరిగే ఎన్నికలు పూర్తయ్యే దాకా సినిమాను థియేటర్స్ తో పాటు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో కూడా ఈ చిత్రాన్ని ప్రదర్శించ రాదని కోర్టు ఆదేశించింది. అయితే ఈ స్టే కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అవుతోంది. ఈ రోజు లక్ష్మీస్ ఎన్టీఆర్ తెలంగాణలో విడుదల కానుంది.
ఏపీలో చిత్ర విడుదలపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో రాంగోపాల్ వర్మ శుక్రవారం ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు.
ఇక సినిమా కాపీని తమ ఛాంబర్‌కు తీసుకువస్తే న్యాయవాదుల సమక్షంలో సినిమా చూస్తామని న్యాయమూర్తి తెలిపారు. సెన్సార్‌బోర్డు ఒకసారి అనుమతించాక అడ్డు చెప్పడానికి వీల్లేదని, నిర్మాత తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. ‘పద్మావత్’ సినిమా విడుదలపై సుప్రీంకోర్టు ఆదేశాలను ఈ సందర్భంగా ప్రస్తావించిన న్యాయవాది.. సినిమాకు తెలంగాణ హైకోర్టు అనుమతించిన విషయాన్నీ కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది.
ఏపీలో చిత్ర విడుదలపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో రాంగోపాల్ వర్మ శుక్రవారం ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు