ఎన్నో వాదాలు, వివాదాలు, సవాళ్లు మధ్య రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మొన్న శుక్రవారం తెలంగాణలో విడుదలైంది. కోర్ట్ తీర్పు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రిలీజ్ పోయింది. వర్మ తనదైన శైలిలో ఈ సినిమాకు హైప్ తీసుకురావడం, చంద్రబాబుని విలన్ గా చూపటం వంటి అంశాలు వల్ల తెలంగాణలో ఈ సినిమాకు ఓ రేజిలో ఓపెనింగ్స్ వచ్చాయి. అసలు టార్గెట్ చేసిన ఏపీ ప్రజల పరిస్దితి ఏమటి. తెలంగాణాలో సినిమా రిలీజ్ అవటంతో…బాగుందని టాక్ రావటంతో ఈ చిత్రంపై ఆంధ్రా జనాల్లో మరింత క్యూరియాసిటీ పెరిగింది.
ఈ నేపధ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పైరసీ వెర్షన్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడిందని సమాచారం. రిలీజైన రోజు రాత్రికు ఈ సినిమా పైరసీ వెర్షన్ మంచి కాపీతో జనాల ల్యాప్ టాప్ లపై వాలిపోయింది. దాంతో తొలి రోజు రాత్రికల్లా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ని జనాలు చూడటం, మాట్లాడుకోవటం మొదలెట్టారు.
మరో ప్రక్క ఫేస్ బుక్ లో ను ఫుల్ సినిమాని కొందరు పోస్ట్ చేసేసారు. వాట్సప్ లో బిట్లు బిట్లుగా ఈ సినిమాను హల్ చల్ చేస్తోంది. ఇలా పైరసీ ప్రింట్ ఎపిలో కనిపించి, అలరిస్తోందంటున్నారు. ఇక పైరసీని ఆపేందుకు వర్మ , ఆయనటీం ప్రయత్నాలు ప్రారంభించినట్లు లేరు. పార్టి ప్రచార చిత్రంగా తీసిన ఈ సినిమా జనాల్లోకి వెళ్తే మంచిదే అని భావించటమే కలిసివస్తున్న అంశం అంటున్నారు.
ఇక ఇది చంద్రబాబుకి, ఆయన పార్టి వారికి కొత్త ఛాలెంజ్ అంటున్నారు. సినిమా రిలీజ్ అయితే ఆపగలిగారు కానీ పైరసీ ని ఆపటం ఎవరివల్లా కాదు అంటున్నారు. దీనిపై వర్మ అండ్ టీమ్ కంప్లైంట్ ఇస్తే ..అప్పుడు పోలీస్ లు రంగంలోకి దిగి, పైరసీ బ్యాచ్ ని పట్టుకుంటే తప్ప ఆగదు. చాలా కాలంగా సినిమా పరిశ్రమ పైరసీని ఆపలేక చేతులెత్తేసింది. ఇప్పుడు ఇది ప్రభుత్వానికి కూడా పెద్ద సమస్యగా కనపడుతోంది.
ఇక సుప్రీం కోర్టుకు వెళ్లి ఏపీలో సినిమాను సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేద్దామని చూస్తున్నారు . ఈ లోగా ఏపి జనం చాలా మంది ఈ సినిమాని చూసేసేటట్లు ఉన్నారు