నుజ్జునుజ్జైన కారు.. పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న కుష్బూ!!

అదృష్ణం బాగా లేకపోతే చిన్న రాయి తగిలిన చచ్చిపోతాం.. అదే లక్ కలిసి వస్తే ఎంత పెద్ద ప్రమాదం జరిగినా సింపుల్‌గా బయటపడతాం. తాజాగా కుష్బూకు కూడా అలాంటి ఓ ఘటనే ఎదురైంది. తాజాగా ఆమె కడలూరులో ఓ ఈవెంట్‌కు బయల్దేరిందట. అయితే మార్గమధ్యంలో కారుకు భారీ ప్రమాదం జరిగి నుజ్జునుజ్జు అయిందట. దేవుడి దయవల్ల, మీ అందరి ప్రేమ వల్ల ఏమీ జరగలేదని ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.

Kushbu Sundar Met Accident,Kushbu
Kushbu Sundar Met Accident,Kushbu

ఈ ఫోటోట్లో కుష్ఫూకు గాయాలైనట్టు కనిపించడం లేదు. కానీ కారు మాత్రం దారుణంగా పాడైపోయింది. ఈ ప్రమాదంపై వెంటనే తన అభిమానులకు సమాచారమిస్తూ ఓ పోస్ట్ చేసింది. ప్రమాదానికి గురైనా కారు ఫోటోలను కూడా షేర్ చేసింది. మెల్‌మార్‌వతూర్ వద్ద కారు ప్రమాదం జరిగింది. ఓ ట్యాంకర్ వచ్చి మా కారును ఢీ కొట్టింది అంటూ వివరాలను చెప్పుకొచ్చింది.

Kushbu Sundar Met Accident,Kushbu
Kushbu Sundar Met Accident,Kushbu

 

మీ అందరూ ప్రేమ, ఆశీర్వాదం వల్ల, దేవుడి దయ వల్ల ఎలాంటి గాయాలు అవ్వలేదు. ఇలాంటి ప్రమాదం జరిగినా నా ప్రయాణాన్ని మళ్లీ ప్రారంభించాను. వేల్‌యాత్రై ఈవెంట్‌లో పాల్గొనేందుకు కడలూరు వెళ్తున్నాను. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. లార్డ్ మురుగన్ మమ్మల్ని కాపాడాడు. మా ఆయన నమ్మకం ఆ దేవుడిపై పెట్టుకున్న నమ్మకం నాకు ఇప్పుడు కనిపించింది అంటూ ఎమోషనల్ అయింది.