సోషల్ మీడియాకు కుష్బూ దూరం.. కారణం తెలిస్తే షాక్!!

Kushbu Eye Got Injured

సినీ, రాజకీయ రంగాల్లో ప్రత్యేకతను చాటుకుంది కుష్బూ. తమిళ రాజకీయాల్లో కుష్బూ వేసే పంచ్‌లు, సెటైర్లు మామూలుగా ఉండవు. జాతీయ రాజకీయాలపై కుష్బూ తనస్టైల్లో కౌంటర్లు వేస్తూ ఉంటుంది. ఇక సినీ రంగంలో అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై కుష్బూ దూసుకుపోతూనే ఉంది. సోషల్ మీడియాలో అయితే అంతకు పదింతల వేగంతో పరిగెత్తుతోంది. నెటిజన్లు వేసే కౌంటర్లు, కుష్బూ ఇచ్చే పంచ్‌లు తెగ వైరల్ అవుతుంటాయి.

kushbu eye got injured
kushbu eye got injured

సోషల్ మీడియాలో ఎదురయ్యే బెదిరింపులను కూడా లెక్కచెయ్యదు. అంతే ధీటుగా సమాధానాలు ఇస్తూ ఉంటుంది. ఇక సాయం చేయండని అడిగిన వారికి వెంటనే చేసేస్తుంది. ఫిట్‌నెస్ పాఠాలు చెబుతూ మహిళా ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో కుష్బూ షేర్ చేసే ఫోటోలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే తాజాగా కుష్బూ షేర్ చేసిన ఫోటో మాత్రం ఎన్నో అనుమానాలకు దారి తీస్తోంది.

కంటికి గాయమైన ఫోటోను షేర్ చేస్తూ.. ‘హాయ్‌.. ఫ్రెండ్స్‌.. ఈరోజు ఉదయం పొరపాటున నా కంటికి కత్తి తగిలి చిన్నపాటి గాయమైంది. దీంతో డాక్టర్లు నా కంటికి ఆపరేషన్‌ చేసి కుట్లు వేశారు. కొద్దికాలం ట్విటర్‌కు దూరంగా ఉండబోతున్నా. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా.. త్వరలో మళ్లీ మీ ముందుకు వస్తా.. అందరూ భౌతికదూరం పాటిస్తూ.. మాస్కు ధరించండి’ అని పేర్కొంది.