హిందూ దేవ‌త‌ల్ని కించ‌ప‌రిచిన వెబ్ మూవీ

                           ఉద్ధేశ పూర్వ‌కంగా దేవ‌త‌లను కించ‌ప‌రిచారా?

క్ష‌ణం ఫేం ర‌వికాంత్ పారేపు తెర‌కెక్కించిన తాజా చిత్రం `కృష్ణ అండ్ హిజ్ లీలా` వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో లైవ్ స్ట్రీమింగులో ఉన్న సంగ‌తి తెలిసిందే. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్, సీరత్ క‌పూర్ త‌దిత‌రులు న‌టించారు. కీర్తి సురేష్ `పెంగ్విన్` త‌ర్వాత రిలీజైన తెలుగు వెబ్ సినిమాగా ప్ర‌స్తుతం దీని గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఇటీవ‌ల రిలీజైన ఈ ఓటీటీ సినిమా తాజాగా వివాదాల్లోకి వ‌చ్చింది. ఇందులో పెచ్చి మీరిన శృంగారం ఉంద‌ని.. అలాగే దేవ‌త‌ల పేర్ల‌ను త‌ప్పుగా ఉప‌యోగించార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. హిందూ దేవ‌త‌ల్ని కించ‌ప‌రుస్తూ వారి పేర్ల‌ను .. దేవ‌తల పేర్ల‌తో పాత్ర‌ల్ని క్రియేట్ చేయ‌డం త‌గ‌ద‌ని ఓ వ్య‌క్తి సైబ‌ర్ క్రైమ్ కి ఫిర్యాదు చేయ‌డంతో ప్ర‌స్తుతం ఈ ఓటీటీ మూవీ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు చిక్కులు ఎదుర‌వుతున్నాయ‌ని తెలుస్తోంది.

ఒక యువ‌కుడు ఓ యువ‌తితో ప్రేమ‌లో ఉండ‌గానే మ‌రో యువ‌తిపై మోజు ప‌డ‌తాడు. అత‌డి యాటిట్యూడ్ కి మ‌రో యువ‌తి ప‌డిపోతుంది. హిందూ సాంప్ర‌దాయం ప్రేమ పెళ్లి అనే వ్య‌వ‌హారాల్ని ప్ర‌శ్నించేదిగా క‌నిపిస్తోంది ఈ వెబ్ సిరీస్. ఆ మేర‌కు ఇప్ప‌టికే టీజ‌ర్ ట్రైల‌ర్ యూత్ లోకి దూసుకెళ్లాయి. అయితే వెబ్ సిరీస్ అంటేనే వేడెక్కించే కంటెంట్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారుతున్నాయి. ఈ కేట‌గిరీలోనే కృష్ణ అండ్ హిజ్ లీలా వ‌చ్చింది. ఇక టైటిల్లో కృష్ణుడు .. లీలా అంటూ దేవ‌త‌ల పేర్ల‌ను ఉప‌యోగించ‌డం వివాదాస్ప‌ద‌మైంది. ఏ ఇంటెన్ష‌న్ తో దేవ‌త‌ల పేర్లు ఉప‌యోగించారు? అన్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. గుంటూర్ టాకీస్ లో యాంక‌ర్ ర‌ష్మీతో అదిరిపోయే రొమాన్స్ చేసిన‌ హీరో సిద్ధు రొమాన్స్ తాజా వెబ్ సినిమాలో పీక్స్ లో ఉంద‌ని కూడా యూత్ లో చ‌ర్చ సాగుతోంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఇత‌ర నిర్మాత‌ల‌తో క‌లిసి ఈ ఓటీటీ మూవీని రిలీజ్ చేసింది.

Krishna and his Leela Trailer | Siddhu | Shraddha | Seerat | Shalini | Ravikanth Perepu