Sidhu Jonnalagadda : డి జే టిల్లు ఈ సినిమా ఒక సంచలనం. హీరో ఆటిట్యూడ్ డైలాగ్ డిక్షన్ కే సినిమా హిట్టయింది. ఏ మాత్రమే అంచనాలు లేకుండా వచ్చిన డీజే టిల్లు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయి సినిమాలు ఎవడబ్బ సొత్తు కాదని టాలెంట్ ఉంటే ఎవరైనా హీరో అవతారని నిరూపించింది. ఈ సినిమాలో నటించిన సిద్దు జొన్నలగడ్డ నటన, డైలాగ్ డిక్షన్ అందరిని ఆకట్టుకుంది. యువతరానికి తెగ నచ్చేసాడు సిద్ధు. అప్పటి వరకు చిన్న సినిమాలు చేస్తూ చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన సిద్ధు కి ఈ సినిమా కెరీర్ ను మలుపు తిప్పే విజయాన్ని అందించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అందరు తనవైపు చూసేలా చేసాడు సిద్ధు.
ఇక సిద్దు బయట కనిపిస్తే చాలు కుర్రకారు ఒకటే ఈలలు, గోల.. బాగా ఫాలోయింగ్ పెరిగిపోయింది సిద్దుకి ఈ సినిమాతో. ఇక పెద్ద సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. నిజానికి సిద్దు డీజే టిల్లు కంటే ముందు కృష్ణా అండ్ హిజ్ లీలా సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ డీజే టిల్లు ఇచ్చినంత పేరు మాత్రం ఆ సినిమాతో రాలేదు మరీ. సిద్దు కీ మంచి ఆఫర్లు వస్తున్నా తన బాడీ లాంగ్వేజ్ కీ సూట్ అయ్యే పాత్రలకోసం ఎదురుచూస్తున్నాడట. అంత వరకు బాగానే ఉన్న డీజే టిల్లు కంటే ముందు కమిట్ అయిన సినిమాలో ఇపుడు నటించను అంటున్నాడట.
సినిమాలో చాలా చిన్న క్యారెక్టర్ అట సిద్దు ది అయితే సినిమా కథను మలుపు తిప్పే పాత్రట. కానీ సిద్దు ఇపుడు అలాంటి పాత్ర చేస్తే హీరో అవకాశాలు ఏమవుతాయో అని చేయడానికి సుముఖంగా లేడట. కానీ అగ్రిమెంట్ పై సంతకం చేసావని చేయాల్సిందే అని డైరెక్టర్ అనడంతో మనోడు నోరు పారేసుకున్నాడట. ఇక ఇదే ఇపుడు ఫిల్మ్‌నగర్ లో హాట్ టాపిక్. ఇలా అయితే సిద్దు సినిమా ఇండస్ట్రీలో ఎలా పైకి వస్తావ్ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.